ఐపీఎల్‌ను కాపీ కొట్టిన పాకిస్తాన్.. ఇకపై ఐపీఎల్ తరహాలో ఆటగాళ్ల కొనుగోలు

by Harish |

ఐపీఎల్‌ను కాపీ కొట్టిన పాకిస్తాన్.. ఇకపై ఐపీఎల్ తరహాలో ఆటగాళ్ల కొనుగోలు
X

దిశ, స్పోర్ట్స్ : భారత్‌లో జరిగే ఐపీఎల్‌ వరల్డ్ క్రికెట్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను సృష్టించుకుంది. ఐపీఎల్‌కు వచ్చిన క్రేజ్ చూసి ఇతర దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఫ్రాంచైజీ లీగ్‌లను మొదలుపెట్టాయి. అందులో పాకిస్తాన్ కూడా ఉంది. 2016లో పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)ను ప్రారంభించింది. ఇప్పుడు ఐపీఎల్‌‌లోని వేలం పక్రియను కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) కాపీ కొడుతోంది. వచ్చే పీఎస్‌ఎల్ సీజన్‌లో ఐపీఎల్ తరహాలో ప్లేయర్ల ఆక్షన్‌‌ను నిర్వహించనుంది. గత సీజన్ వరకు డ్రాఫ్ట్ సిస్టమ్‌ ద్వారా ఫ్రాంచైజీలు ఆటగాళ్లను కొనుగోలు చేసేవి. వచ్చే సీజన్‌ నుంచి పీసీబీ డ్రాఫ్ట్ సిస్టమ్ విధానానికి స్వస్థ పలికి వేలం ప్రక్రియను ప్రవేశపెట్టనుంది.

తాజాగా పీఎస్‌ఎల్ ఫ్రాంచైజీలు, పీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సల్మాన్ నసీర్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. వేలం ప్రక్రియను అమలు చేయాలని చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఒత్తిడి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. లీగ్ దీర్ఘకాలిక వృద్ధి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సల్మాన్ నసీర్ తెలిపారు. కొత్త స్ట్రక్చర్ ప్రకారం.. ప్రతి ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురు ప్లేయర్లను రిటైన చేసుకోవచ్చు. గతంలో 8 మంది ప్లేయర్లను అంటిపెట్టుకునే వీలు ఉండేది. మెంటార్, బ్రాండ్ అంబాసిడర్, రైట్ టూ మ్యాచ్ ఆప్షన్లను తొలగించారు. మార్చి 26 నుంచి పీఎస్‌ఎల్ 11వ సీజన్ ప్రారంభంకానుంది.


Next Story