రేపటి నుంచే PSL ప్రారంభం..మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు ( IPL 2025) కొనసాగుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) మరో

రేపటి నుంచే PSL ప్రారంభం..మ్యాచ్ టైమింగ్స్, స్ట్రీమింగ్ వివరాలు ఇవే !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటు ( IPL 2025) కొనసాగుతున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) మరో క్రికెట్ లీగ్ తో ముందుకు వస్తోంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ తో ( Pakistan Super League 2025) సందడి చేసేందుకు పాక్ బోర్డు సిద్ధమైంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ టోర్నమెంట్ ప్రారంభమై... రేపటికి పది సంవత్సరాలు పూర్తవుతుంది. 2015 సంవత్సరంలో... పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రారంభమైంది. అప్పటినుంచి ఇప్పటివరకు... ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో 20% మేర సక్సెస్ గా నడుపుతూ కొనసాగిస్తున్నారు. ఇక పాకిస్తాన్ సూపర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో 6 జట్లు తలపడతాయి.

మ్యాచ్ టైమింగ్స్, మొదటి మ్యాచ్ ఎవరి మధ్య అంటే ?

పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ లో జరిగే ప్రతి మ్యాచ్ సాయంత్రమే ప్రారంభం అవుతుంది. మొదటి మ్యాచ్ ఇస్లామాబాద్ యునైటెడ్ వర్సెస్ లాహోర్ క్యాలండర్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది. ఏప్రిల్ 11వ తేదీ నుంచి మే 18 వరకు ఈ టోర్నమెంట్ కొనసాగుతుంది.

PSL 2025 టోర్నమెంట్ ఎక్కడ చూడాలి?

పాకిస్తాన్ సూపర్ లీగ్ కు Pakistan Super League 2025) సంబంధించిన మ్యాచ్లను ఇండియాలో... సోనీ స్పోర్ట్స్ లో చూడవచ్చు. ఇక పాకిస్తాన్ లో అయితే దట్ స్పోర్ట్స్ హెడ్, పెటివ్ స్పోర్ట్స్ హెడ్, థాపిమాడ్, తమాషా, దరాజ్, మీకో, బిగిన్ చూడవచ్చును.

Next Story