- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీమిండియాను వణికిస్తున్న రికార్డ్స్... అదే జరిగితే పాకిస్తానే ఛాంపియన్ ?
పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా రెండు జట్లు కూడా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ తరహాలో... ఇతర సిరీస్ ఫైనల్స్ లో తలపడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ నేపథ్యంలో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఫైట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ ఇవాళ రాత్రి 8 గంటల సమయంలో ప్రారంభం కానుంది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుస్తుందని అందరూ అంటున్నారు. అయితే పాత రికార్డులు మాత్రం టీమిండియాను వనికిస్తున్నాయి. గతంలో... ఆసియా కప్ తరహాలోనే జరిగిన ఫైనల్స్ లో పాకిస్తాన్ ఎక్కువ విజయాలను నమోదు చేసుకుంది. ఇప్పుడు ఇదే అంశం టీమిండియాను అనిపిస్తోంది.
పాకిస్తాన్ వర్సెస్ టీమిండియా రెండు జట్లు కూడా ఆసియా కప్ 2025 టోర్నమెంట్ తరహాలో... ఇతర సిరీస్ ఫైనల్స్ లో తలపడ్డాయి. అలా ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య ఐదు ఫైనల్స్ జరిగాయి. ఇందులో టీమిండియా కేవలం రెండు మ్యాచ్ లలో విజయం సాధించగా... పాకిస్తాన్ మూడు మ్యాచ్ లలో విజయం సాధించింది. అంటే టీమిండియా కంటే పాకిస్తాన్ ఫైనల్స్ కు వచ్చేసరికి అద్భుతంగా రానిస్తోంది. మరి ఇవాళ జరిగే ఫైనల్ మ్యాచ్ లలో ఎలా రాణిస్తుందో చూడాలి.






