- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏకే47 సెలబ్రేషన్ చేశా.. ఐతే ఏంటి?.. ఫైనల్‌లో ఇండియాతో ఆడేది మేమే!
ఏకే47 సెలబ్రేషన్ చేశా.. ఐతే ఏంటి? అని పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అన్నాడు. ఆసియా కప్ ఫైనల్‌లో ఇండియాతో తలపడేది తామేనని ప్రకటించాడు.

దిశ, స్పోర్ట్స్: భారత్ చేతిలో చిత్తుగా ఓడినా కూడా పాక్ ఆటగాళ్లకు బుద్ధిరాలేదు. భారత్‌పై హఫ్ సెంచరీ చేసిన తర్వాత ఏకే47 పేల్చినట్లు సెలబ్రేట్ చేసుకోవడాన్ని ఆ టీం ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ సమర్థించుకున్నాడు. ఆ సెలబ్రేషన్ ఒక మూమెంట్ అని, తను సాధారణంగా అంతగా సెలబ్రేషన్స్ చేసుకోనని ఫర్హాన్ అన్నాడు. ‘సడెన్‌గా ఎందుకో సెలబ్రేట్ చేసుకోవాలని అనిపించింది. దాన్ని ఎలా అర్థం చేసుకుంటారో నాకు తెలీదు. ఐ డోన్ట్ కేర్. ఇక ఎగ్రెసివ్ క్రికెట్ అయితే.. ఎవరితో ఆడుతున్నా అలాగే ఆడాలి. ఇండియా మీదే కాదు.. ప్రత్యర్థి ఎవరైనా అలాగే ఆడతాం’ అని చెప్పాడు.
ఈ ఓటమితో బంగ్లాతో జరిగే సూపర్-4 మ్యాచ్.. పాక్‌కు చావో రేవోగా మారింది. ఈ మ్యాచ్ తాము తప్పక గెలిచి ఆసియా కప్ ఫైనల్ చేరుకుంటామని, అక్కడ మరోసారి భారత్‌ను ఎదుర్కొంటామని ఫర్హాన్ ధీమా వ్యక్తంచేశాడు. బంగ్లా చేతిలో ఓడితే ఆసియా కప్ నుంచి పాక్ దాదాపు తప్పుకున్నట్లే. అయితే తాము భారత్‌పై మెరుగైన ప్రదర్శన చేశామని, చాలా కాన్ఫిడెంట్‌గా ఆడామని ఫర్హాన్ అన్నాడు. పవర్‌ప్లేలో వికెట్లు కోల్పోవడం తమకు సమస్యగా ఉండేదని, దాన్ని భారత్‌తో మ్యాచులో అధిగమించామని చెప్పాడు. మిడిల్ ఓవర్లలో తడబడ్డామని, ఈ సమస్యను కూడా అధిగమిస్తామని ధీమా వ్యక్తంచేశాడు.






