- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారత్, పాక్ మ్యాచ్ 15 ఓవర్లే చూశా.. ఆ మ్యాచ్‌కు ఓవర్ హైప్ అవసరం లేదు : గంగూలీ
ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో పాకిస్తాన్‌ను టీమిండియా చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచ్‌పై భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాక్‌పై టీమిండియాది వన్ వే ట్రాఫిక్ అంటూ వ్యాఖ్యానించాడు. అందుకే ఫలితం తనను ఆశ్చర్యపర్చలేదన్నాడు. తాను కేవలం 15 ఓవర్లు మాత్రమే చూశానని, ఆ తర్వాత ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్‌లో మాంచెస్టర్ యునైటెడ్, మ్యాన్ సిటీ మధ్య ఫుట్‌బాల్ మ్యాచ్ చూశానని చెప్పాడు. అలాగే, టీమిండియాకు పాక్ కనీసం పోటీ ఇవ్వలేకపోయిందన్నాడు. ఆ జట్టులో నాణ్యమైన ప్లేయర్లు లేరని చెప్పాడు. భారత్, పాక్ మ్యాచ్‌పై హైప్ అవసరం లేదంటూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘భారత్‌కు పాక్ కనీస పోటీ ఇవ్వడం లేదు. దానికి బదులు ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, శ్రీలంకలతో భారత్ ఆడటాన్ని చూడాలనుకుంటున్నా. అఫ్గాన్‌తో కూడా ఓకే. భారత్‌కు పాక్ పోటీ అని అనుకోవడం లేదు. గత ఐదేళ్లుగా ఆ మ్యాచ్‌పై ఉన్న హైప్ పోయింది. అంతా వన్ వే ట్రాఫికే’అని గంగూలీ చెప్పుకొచ్చాడు.






