ఘోర ఓటమి..పాకిస్తాన్ జ‌ట్టులో ప్రకంపనలు, అర్ధరాత్రి కీలక నిర్ణయం!

by velandi.Saikiran |   (  Updated:2026-02-17 01:03:54  IST  )

కొలంబో వేదిక‌గా జ‌రిగిన భార‌త మ్యాచ్ లో పాక్ ఓటమి పాలైంది. దీంతో బాబర్ ఆజం, షాహీన్ లను తొలగించే అవకాశం ఉందని స‌మాచారం.

ఘోర ఓటమి..పాకిస్తాన్ జ‌ట్టులో ప్రకంపనలు, అర్ధరాత్రి కీలక నిర్ణయం!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత జట్టు చేతిలో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారింది. నిజంగానే శివరాత్రి రోజు పాకిస్తాన్ కు భారత జట్టు నిద్ర లేకుండా చేసిందని చెప్పవచ్చు. కొలంబో వేదికగా ఆదివారం భారత్ ( India), పాకిస్తాన్ ( Pakistan) మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ అత్యంత దారుణంగా ప్రదర్శన కనబరిచి, గతంలో ఎన్నడూ లేని విధంగా భారత జట్టు చేతిలో ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్ ఇలా రెండు విభాగంలో కూడా చేతులెత్తేసింది పాకిస్తాన్. ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. జ‌ట్టులో కీల‌క మార్పులు చేసేందుకు సిద్ధం అయింద‌ట పీసీబీ.

భారత చేతిలో ఓటమి.. పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెను ప్రకంపనలు

కొలంబో వేదికగా భారత జట్టు చేతిలో ఓడిపోయిన పాకిస్తాన్ క్రికెట్ జట్టులో పెను ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ జట్టులో ఉన్న సీనియర్ ప్లేయర్ల చెత్త ప్రదర్శన కారణంగానే ఓటమి ఎదురైందని మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు. షాహిద్ ఆఫ్రిది, యూసఫ్, కనేరియా లాంటి సీనియర్ క్రికెటర్లు కూడా.. పాకిస్తాన్ ( Pakistan) చెత్త ప్రదర్శనను ఎత్తి చూపిస్తున్నారు. అయితే ఆదివారం భారత జట్టు చేతిలో పాకిస్తాన్ ఓడిపోయిన నేపథ్యంలో PCB సంచలన నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆడే మిగిలిన మ్యాచ్ ల నేపథ్యంలో జట్టులో పెను మార్పులు చేస్తామని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు సంబంధించిన ఓ అధికారి వెల్లడించారట. దీని ప్రకారం పాకిస్తాన్ లో సీనియర్ క్రికెటర్లు అయిన బాబర్ ఆజం ( Babar Azam), ఫాస్ట్ బౌలర్ షాహిన్ ఆఫ్రిదిపై ( Shaheen Afridi) వేటు వేయనున్నట్లు కూడా ఆయన వెల్లడించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక ఆ ఇద్దరి స్థానంలో కొత్త కుర్రాళ్లకు ఛాన్సులు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. సల్మాన్ మిర్జా, ఫకర్, ఖ‌వాజా లేదా నసీమ్... ఈ నలుగురిలో ఇద్దరినీ ఫైనల్ చేసే ఛాన్స్ ఉంది.

ఇద్దరు కొత్త ప్లేయర్లతోనే నమీబియాతో మ్యాచ్ ఆడబోతోందట పాకిస్తాన్. నమీబియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ చాలా కీలకమైనది. ఇందులో పాకిస్తాన్ ఓడిపోతే ఇంటి దారి పట్టాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అందుకే పాకిస్తాన్ చాలా ఆచితూచి ఆడబోతోంది. భారత జట్టుతో ఆడినట్లుగా కాకుండా, చాలా సీరియస్ గా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆడబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ( PCB) నుంచి కీలక ఆదేశాలు కూడా వచ్చాయట. కచ్చితంగా సూపర్ 8 లోకి వెళ్లేలా చూడాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా స్పష్టం చేసిందట. లేకపోతే కఠినమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరికలు జారీ చేసిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

Next Story