టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌..కొలంబోకు క‌లిసి రానున్న ఆసీస్‌, పాకిస్తాన్ !

by velandi.Saikiran |

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు 3 టీ20లు జరుగుతాయి.

టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌..కొలంబోకు క‌లిసి రానున్న ఆసీస్‌, పాకిస్తాన్ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీ20 ప్రపంచ కప్ ఆడేందుకు పాకిస్తాన్ సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట. ఫిబ్రవరి 2వ తేదీన కొలంబో వచ్చేందుకు పాకిస్తాన్ టీం సంసిద్ధమవుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే రోజున ఉదయం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సోమవారంలోపు తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఇప్పటికే న‌ఖ్వీ వెల్లడించారు. దానికి తగ్గట్టుగానే, ఫిబ్రవరి 2వ తేదీన కొలంబో వెళ్లేందుకు టికెట్లు బుక్ చేసిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు.

కొలంబోకు క‌లిసి రానున్న ఆసీస్‌, పాకిస్తాన్ ?

ఆస్ట్రేలియా, పాకిస్తాన్ మధ్య ఇవాళ్టి నుంచి టీ20 సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ రెండు జట్ల మధ్య ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు 3 టీ20లు జరుగుతాయి. ఇక ఫిబ్రవరి 2వ తేదీన పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఫ్లైట్ ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. అయితే కొలంబోకు పాకిస్తాన్ వెళ్ళనుందట. ఆస్ట్రేలియా మాత్రం ఇండియాకు రానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా, టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి ఇప్పటికే బంగ్లాదేశ్ తప్పుకుంది. ఇండియాలో భద్రతా సమస్యలు వస్తాయని కారణం చెప్పి టోర్నమెంట్ నుంచి పూర్తిగా వైదొలిగింది. శ్రీలంకలో తమ మ్యాచ్ లు నిర్వహించాలని డిమాండ్ చేసినప్పటికీ ఐసీసీ రిజెక్ట్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ బరిలో నిలిచింది.

Next Story