- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
WTC ర్యాంకింగ్స్.. 7వ స్థానానికి దిగజారిన పాకిస్తాన్ !
WTC ర్యాంకింగ్స్ లో 7వ స్థానానికి పడిపోయింది పాకిస్తాన్.

దిశ, వెబ్ డెస్క్: ఢాకా వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ లో పాకిస్తాన్ చిత్తుగా ఓడింది. మే 8వ తేదీన ప్రారంభమైన తొలి టెస్ట్ లో బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ కు వర్షం పలుమార్లు ఆటంకం కలిగించినప్పటికీ, ఫలితం మాత్రం వచ్చింది. ఐదు రోజుల పాటు కొనసాగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏకంగా 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ టీమ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
7వ స్థానానికి పడిపోయిన పాకిస్తాన్
బంగ్లాదేశ్ చేతిలో ఓడిన పాకిస్తాన్ జట్టుకు మరో షాక్ తగిలింది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్ లో పాకిస్తాన్ ఏడవ స్థానానికి దిగజారింది. ప్రస్తుత WTC సైకిల్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఆడింది పాక్. ఇందులో ఓ విజయం నమోదు చేసుకోగా, రెండింటిలో ఓడిపోయింది. దీంతో ఏడో స్థానానికి పరిమితమైంది పాకిస్తాన్. అటు పాక్ పై విజయం సాధించిన బంగ్లాదేశ్, ఆరో స్థానానికి చేరుకుంది. మొదటి స్థానంలో ఆస్ట్రేలియా ఉండగా, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. భారత జట్టు ఐదవ స్థానంలో కొనసాగుతోంది.






