- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: పాకిస్తాన్ క్రికెట్ టీమ్ (Pakisthan Team ) ఇప్పుడు పీకల్లోతు కష్టాల్లో ఉంది. సరైన విజయాలు లేక... సతమతమవుతోంది పాకిస్తాన్. దానికి తోడు మొన్న జరిగిన చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో (Champions Trophy 2025).. ఒక్క మ్యాచ్ గెలవకుండానే వైదొలిగింది. సొంత గడ్డపై పరువు పోగొట్టుకుంది పాకిస్తాన్. అయితే నిత్యం వివాదాస్పద సంఘటనలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన పాకిస్తాన్ టీమ్... మరో వివాదంలో చిక్కుకుంది. తాజాగా ఓ అభిమానిని... కొట్టేందుకు పాకిస్తాన్ క్రికెటర్ దూసుకు వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ 3 వన్డేల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసి... కైవసం చేసుకుంది న్యూజిలాండ్ (New zeland ). శనివారం రోజున మూడవ వన్డేలో కూడా... పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. ఏకంగా 43 పరుగుల తేడాతో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది న్యూజిలాండ్. అంతకు ముందు టి20 సిరీస్ కూడా కోల్పోయింది పాకిస్తాన్. అయితే శనివారం రోజున జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడంతో... ఆ జట్టుకు సంబంధించిన ఫ్యాన్స్... తీవ్ర నిరాశకు లోనయ్యారు. పాకిస్తాన్ టీం లో చెత్త ప్లేయర్లు ఉన్నారని... అందుకే దారుణంగా ఓడిపోయారని.. బహిరంగంగానే కామెంట్స్ చేశారు అభిమానులు.
మూడవ వన్డే సందర్భంగా కూడా బహిరంగంగానే... పాకిస్తాన్ క్రికెటర్లను బండ బూతులు తిట్టారు అభిమానులు. దీంతో రగిలిపోయిన పాకిస్తాన్ క్రికెటర్ ఖుస్దిల్ షా..... అభిమానుల పైకి దూసుకు వెళ్ళాడు. ముఖ్యంగా ఓ అభిమానిని కొట్టేందుకు.. ప్రయత్నించాడు పాకిస్తాన్ క్రికెటర్ ఖుస్దిల్ షా ( Pakistan cricketer Khusdil Shah ). అయితే అంతలోనే సెక్యూరిటీ అడ్డు పడింది. అటు అభిమానులు కూడా తమ స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. దీంతో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. పాకిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇదొక బ్లాక్ డే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
🚨 Black Day For Pakistan Cricket
— mufaddla parody (@mufaddl_parody) April 5, 2025
After losing the match, Pakistan cricketer Khusdil Shah was beaten by Pakistani Fans. pic.twitter.com/aPryaoboHl






