అభిశేక్ శర్మ కోసం తెగ వెతుకుతున్న పాకిస్థానీలు

by Ajay Maddhiboyina |

టీమ్ ఇండియా ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ కోసం పాకిస్థానీలు తెగ వెతికేస్తున్నారు. ప్ర‌స్తుతం బ్యాటింగ్ సెన్సేష‌న్ గా నిలుస్తున్న

అభిశేక్ శర్మ కోసం తెగ వెతుకుతున్న పాకిస్థానీలు
X

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా ప్లేయ‌ర్ అభిషేక్ శ‌ర్మ కోసం పాకిస్థానీలు తెగ వెతికేస్తున్నారు. ప్ర‌స్తుతం బ్యాటింగ్ సెన్సేష‌న్ గా నిలుస్తున్న అభిషేక్ శ‌ర్మకు భార‌త్‌లో క్రికెట్ లవర్స్ ఫిదా అవుతున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్థానీలు సైతం అతడివెంటే పడటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఎంతలా అంటే తన దేశ క్రికెకర్లు బాబర్, షాహీన్ అఫ్రిదీ కంటే కూడా అభిషేక్‌నే ఇష్టపడుతున్నారట.

అంతే కాకుండా 2025లో గూగుల్ లో అతడి గురించే వెతకడంతో పాకిస్థానీలు ఎక్కువగా సెర్చ్ చేసిన క్రికెటర్ లలో అభిషేక్ నంబర్ వన్ స్థానంలో నిలిచాడు. రెండో స్థానంలో పాకిస్థాన్ క్రికెటర్ నవాజ్ ఉన్నాడు. ఇదిలా ఉంటే అభిషేక్ రెండు నెలల క్రితం యూఏఈలో జరిగిన ఆసియా కప్‌లో అభిషేక్ వరుసగా 74 (39), 31 (13) పరుగులతో పాకిస్థానీ బౌలర్లకు చెమటలు పట్టించాడు. ఈ టోర్నమెంట్ లో 200 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 314 పరుగులు చేసి, అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

Next Story