బాబర్, రిజ్వాన్ ఇద్దరూ డిమోట్.. ప్లేయర్ల పరువు తీసేసిన పీసీబీ

by Phanindra |

బాబర్, రిజ్వాన్ ఇద్దర్నీ పాక్ క్రికెట్ బోర్డు డిమోట్ చేసింది. ఒక్కరికీ కేటగిరీ-ఎ కాంట్రాక్ట్ ఇవ్వకుండా అందరి పరువు తీసేసింది.

బాబర్, రిజ్వాన్ ఇద్దరూ డిమోట్.. ప్లేయర్ల పరువు తీసేసిన పీసీబీ
X

దిశ, స్పోర్ట్స్: పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ సొంత ప్లేయర్ల పరువు తీసేసింది. తాజాగా 2025-2026 సంవత్సరానికి ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల్లో ఒక్కరంటే ఒక్కరికి కూడా కేటగిరీ-ఎ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. పాకిస్తాన్ ఇచ్చే అత్యున్నత కాంట్రాక్ట్ ఇదే. గతేడాది కేవలం బాబర్ ఆజమ్, మహమ్మద్ రిజ్వాన్ ఇద్దరే ఈ కాంట్రాక్ట్ అందుకున్నారు. ఈ ఏడాది వీళ్లను కూడా ‘కేటగిరీ-బి’కి డిమోట్ చేసినట్లు పీసీబీ ప్రకటించింది. గతేడాది కేటగిరీ-బిలో ఉన్న పాక్ టెస్టు కెప్టెన్ షాన్ మసూద్‌ను ఏకంగా కేటగిరీ-డికి డిమోట్ చేసేసింది. గతేడాది అసలు ఎలాంటి కాంట్రాక్టూ దక్కని వెటరన్ బ్యాటర్ ఫఖర్ జమాన్‌కు కేటగిరీ-బి కాంట్రాక్టు అందించింది. ‘ఒక్క ఆటగాడికి కూడా కేటగిరీ-ఎ పొందే అర్హత లేదని పీసీబీ భావించింది. అందుకే ఎవరికీ ఆ స్థాయి కాంట్రాక్ట్ ఇవ్వలేదు’ అని పీసీబీ వర్గాలు చెప్తున్నాయి.

Next Story