పాక్ క్రికెట్ బోర్డులో అవకతవకలు.. అక్రమ నియామకాలు, కాంట్రాక్ట్‌లు ఇచ్చినట్టు బట్టబయలు

by Harish |

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆ దేశ ఆడిటర్ జనరల్ బయటపెట్టారు.

పాక్ క్రికెట్ బోర్డులో అవకతవకలు.. అక్రమ నియామకాలు, కాంట్రాక్ట్‌లు ఇచ్చినట్టు బట్టబయలు
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)లో భారీగా అవకతవకలు చోటుచేసుకున్నట్టు ఆ దేశ ఆడిటర్ జనరల్ బయటపెట్టారు. కోట్లాది రూపాయలు పక్కదారి పట్టడమే కాకుండా అక్రమ నియామకాలు, కాంట్రాక్ట్‌లు ఇచ్చినట్టు ఆడిట్ నివేదిక పేర్కొంది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు భద్రత కల్పించినందుకు పోలీసులకు భోజనం కోసం రూ. 6 కోట్లు సహా అనేక అవకతవకలు ఆడిట్ రిపోర్ట్‌‌లో బట్టబయలు అయ్యాయి. మీడియా హక్కులను రిజర్వ్ ధర కంటే తక్కువకు కట్టబెట్టడం వల్ల పీసీబీ రూ.19 కోట్లు నష్టపోయిందని తెలిపింది. మ్యాచ్ అఫీషియల్స్‌కు రూ.38 లక్షలు అదనంగా ఇచ్చినట్టు చెప్పింది. 2023 అక్టోబర్‌లో ఎలాంటి ప్రక్రియ లేకుండా మీడియా డైరెక్టర్‌ను నియమించడాన్ని రిపోర్ట్ హైలెట్ చేసింది. గతేడాది ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య పీసీబీ చైర్మన్‌కు యుటిలిటీ చార్జీలు, పీవోఎల్, వసతి చెల్లింపుల రూపంలో రూ. 4 లక్షలు అనధికారికంగా చెల్లించినట్టు నివేదిక పేర్కొంది. అలాగే, అక్రమ నియామకాలను కూడా ఏజీ గుర్తించింది. కరాచీలో హై పర్ఫామెన్స్ సెంటర్‌లో అండర్-16 ఏజ్ గ్రూపులో ముగ్గురు కోచ్‌లను అనధికారంగా నియమించినట్టు తేలింది. అలాగే, ఓపెన్ కాంపిటీషన్ లేకుండానే టికెట్ కాంట్రాక్ట్‌లు ఇచ్చినట్టు నివేదిక తెలిపింది.

Next Story