- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధ్వంసం సృష్టించిన డివిలియర్స్.. డబ్ల్యూసీఎల్ టైటిల్ సౌతాఫ్రికా చాంపియన్స్‌దే
వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) రెండో సీజన్ విజేతగా సౌతాఫ్రికా చాంపియన్స్ నిలిచింది.

దిశ, స్పోర్ట్స్ : వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్(డబ్ల్యూసీఎల్) రెండో సీజన్ విజేతగా సౌతాఫ్రికా చాంపియన్స్ నిలిచింది. ఫైనల్‌లో పాకిస్తాన్ చాంపియన్స్‌ను చిత్తు చేసి టైటిల్ ఎగరేసుకుపోయింది. శనివారం అర్ధరాత్రి జరిగిన టైటిల్ పోరులో సౌతాఫ్రికా చాంపియన్స్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. షర్జీల్ ఖాన్(76) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఉమన అమిన్(36 నాటౌట్), అసిఫ్ అలీ(28) విలువైన రన్స్ జోడించారు. అయితే, 196 పరుగుల టఫ్ టార్గెట్‌ను సౌతాఫ్రికా అలవోకగా ఛేదించింది. ఛేదనలో ఏబీ డివిలియర్స్ విధ్వంసం సృష్టించాడు. పాక్ బౌలర్ల నడ్డివిరిచిన అతను ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 60 బంతుల్లోనే 12 ఫోర్లు, 7 సిక్సర్లతో 120 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అతనికితోడు జీన్ పాల్ డుమిని(50 నాటౌట్) కూడా మెరుపు హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. దీంతో సౌతాఫ్రికా 16.5 ఓవర్లలో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపొందింది.






