- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Asia Cup : పాక్‌ను ఆదుకున్న నవాజ్, తలట్.. కీలక మ్యాచ్‌లో శ్రీలంక పై గెలుపు
ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది.

దిశ, స్పోర్ట్స్ : ఆసియా కప్‌లో పాకిస్తాన్ జట్టు ఫైనల్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. తొలి సూపర్-4 మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన ఆ జట్టు రెండో గేములో శ్రీలంకపై గెలిచి ఎలిమినేట్ నుంచి ప్రస్తుతానికి తప్పించుకుంది. అబుదాబి వేదికగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో పాక్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 133 పరుగులు చేసింది. కమిందు మెండిస్ హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. మిగతా బ్యాటర్లు విఫలమైన వేళ అతను 44 బంతుల్లో 50 రన్స్ చేసి జట్టుకు పోరాడే స్కోరు అందించాడు. పాక్ బౌలర్లలో షాహీన్ అఫ్రిది 3 వికెట్లు, హరిస్ రౌఫ్, హుస్సేన్ తలట్ చెరో 2 వికెట్లు తీసి శ్రీలంకను కట్టడి చేశారు. అయితే, 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి పాక్ కష్టపడింది. శ్రీలంక బౌలర్లు తీక్షణ, హసరంగ రెచ్చిపోవడంతో పాక్ ఆరంభంలో ఇబ్బందిపడింది. ఫర్హాన్(24), ఫకర్ జమాన్(17), సైమ్ అయూబ్(2), కెప్టెన్ సల్మాన్(5), హరిస్(13) వెనువెంటనే వికెట్లు కోల్పోవడంతో పాక్ 80 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో మహ్మద్ నవాజ్(38 నాటౌట్), హుస్సేన్ తలట్(32 నాటౌట్) జట్టును ఆదుకున్నారు. లంక బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్ని వీరు పాక్‌ను పోటీలోకి తీసుకొచ్చారు. వికెట్ కాపాడుకుని మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే జట్టును విజయతీరాలకు చేర్చారు. లేదంటే పాక్ ఫైనల్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యేవి. మరోవైపు, వరుసగా రెండో ఓటమితో శ్రీలంక ఫైనల్ బెర్త్‌కు దాదాపుగా దూరమైనట్టే.






