PAK Vs BAN: చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్.. తొలి వన్డేలో 114 పరుగులకే ఆలౌట్

by Kema Shiva Kumar |

బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ 114 పరుగులకే కుప్పకూలింది. టీ20 వరల్డ్ కప్ పరాభవం తర్వాత పాక్ మరోసారి పేలవ ప్రదర్శనతో నిరాశపరిచింది.

PAK Vs BAN: చిత్తుచిత్తుగా ఓడిన పాకిస్థాన్.. తొలి వన్డేలో 114 పరుగులకే ఆలౌట్
X

దిశ, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్ (Bangladesh) పర్యటనలో పాకిస్థాన్ (Pakistan) క్రికెట్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్‌లో వైఫల్యం తర్వాత కోలుకుంటుందని భావించిన పాక్, తొలి వన్డేలోనే బంగ్లాదేశ్ బౌలర్ల దాటికి పేకమేడలా కూలిపోయింది. ఇవాళ ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్, పాక్‌ను చిత్తు చేసింది.

కుప్పకూలిన పాక్ బ్యాటింగ్ లైనప్..

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ నిర్ణయం సరైనదని ఆ దేశ బౌలర్లు నిరూపించారు. ఇన్నింగ్స్ ప్రారంభంలో సాహిబ్‌జాదా ఫర్హాన్ (27), మాజ్ సదాకత్ (18) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి నిలకడగా ఆడుతున్నట్లు కనిపించారు. అయితే, నహిద్ రానా ఈ భాగస్వామ్యాన్ని విడదీయడంతో పాక్ పతనం మొదలైంది. ఒకరి వెనుక ఒకరు పెవిలియన్ బాట పట్టడంతో 82 పరుగులకే పాక్ 9 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. జట్టును ఆదుకుంటారనుకున్న స్టార్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (10), సల్మాన్ అఘా (5), హుస్సేన్ తలత్ (4) పూర్తిగా నిరాశపరిచారు. అబ్దుల్ సమద్ డకౌట్ కాగా, కెప్టెన్ షాహీన్ అఫ్రిది కేవలం 4 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. చివరిలో ఫహీమ్ అష్రఫ్ (37 పరుగులు, 47 బంతుల్లో) కాసేపు పోరాడటంతో పాకిస్థాన్ కనీసం వంద పరుగులైన దాటగలిగింది.

నిప్పులు చెరిగిన నహిద్ రానా..

బంగ్లాదేశ్ యువ పేసర్ నహిద్ రానా (Nahid Rana) నిప్పులు చెరిగే బంతులతో పాక్ బ్యాటర్లను వణికించాడు. కేవలం 24 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ నడ్డి విరిచాడు. కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ 3 వికెట్లతో రాణించగా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్ చెరో వికెట్ సాధించారు. ఇక 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బంగ్లాదేశ్ ఇప్పుడు ఛేదనను ప్రారంభించనుంది. వరుస ఓటములతో సతమతమవుతున్న పాకిస్థాన్‌కు ఈ ప్రదర్శన పెను సవాలుగా మారింది. అనంతరం 115 పరుగులు టార్గెట్‌లో బరిలోకి దిగిన బంగ్లా బ్యాటర్లు 2 వికెట్లు కోల్పోయి 15.1 ఓవర్లలో మ్యాచ్‌‌ను ముగించేశారు. తన్‌జీద్ హసన్ తమీమ్ 67, నజ్‌ముల్ హుస్సేన్ శాంటో 27 పరుగులతో చెలరేగారు. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిదీ, మహమ్మద్ వసీమ్ చెరో వికెట్ తీసుకున్నారు.

Next Story