- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pahalgam Terror Attack : పహల్గాం ఉగ్రదాడి ఘటన.. ఆ టోర్నీకి భారత్ దూరం
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ మేడోస్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లోని బైసరన్ మేడోస్‌లో జరిగిన ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో 28 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్ పట్ల భారత్ పలు కఠిన నిర్ణయాలు తీసుకుంది. భారత్ లో ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే దేశం విడిచి వెళ్లాలని హుకుం జారీ చేసింది. అట్టారి బోర్డర్ సరిహద్దును కూడా మూసివేస్తున్నట్టు ప్రకటించింది. పాక్ కూడా ఇలాంటి నిర్ణయాలే తీసుకొని, వాటిని కఠినంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో పాకిస్తాన్ లో జరగనున్న ఆసియా వాలీబాల్ చాంపియన్‌షిప్(Asian Volleyball Championship) నుంచి వైదొలగుతున్నట్టు భారత్ ప్రకటించింది.
ఉగ్రదాడి నేపథ్యంలో ఇస్లామాబాద్(Islamabad) లో జరగనున్న ఈ టోర్నీ నుంచి తాము తప్పుకుంటున్నట్టు భారత వాలీబాల్ ఫెడరేషన్(Inidan Volleyball Federation) స్పష్టం చేసింది. భవిష్యత్తులో కూడా ఆ దేశంలో జరిగే ఏ టోర్నీలో కూడా పాల్గొనబోమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది. అంతేకాదు.. అన్ని రకాల అంతర్జాతీయ క్రీడల నుంచి పాక్ ను నిషేధించాలని ప్రపంచ దేశాలను కోరింది.






