Asia Cup 2025: ఆసియాకప్ పై పహల్గామ్ అటాక్ ఎఫెక్ట్?

by Naga Rani Yarlagadda |

ఇండియా - పాకిస్థాన్ (India - Pakistan) క్రికెట్ మ్యాచులపై కూడా నిర్వాహకులు పునరాలోచన చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Asia Cup 2025: ఆసియాకప్ పై పహల్గామ్ అటాక్ ఎఫెక్ట్?
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) ఘటనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది కేవలం ఉగ్రవాదుల చర్య కాదని, ఈ దాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందన్న అనుమానాలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఈ క్రమంలో ఇండియా - పాకిస్థాన్ (India - Pakistan) క్రికెట్ మ్యాచులపై కూడా నిర్వాహకులు పునరాలోచన చేయాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఆసియా కప్ నిర్వహణపై కూడా సందిగ్ధత ఏర్పడింది. ఆగస్టులో జరగాల్సిన భారత్ - బంగ్లాదేశ్ (IND - BAN) ద్వైపాక్షిక సిరీస్‌తో పాటు సెప్టెంబర్‌లో జరగాల్సిన ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నిర్వహణ కూడా కష్టమేనని తెలుస్తోంది.

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ (Asia Cup 2025) సెప్టెంబర్‌లో జరగాల్సి ఉన్నా.. ఇంకా వేదిక ఖరారు చేయలేదు. తటస్థ వేదికలో నిర్వహించాలన్న ఆలోచనలు మాత్రం ఉన్నాయి. కానీ.. ఈ టోర్నమెంట్ పై పహల్గామ్ టెర్రర్ అటాక్ ఎఫెక్ట్ ఉంటుందని క్రికెట్ ఫ్యాన్స్ చెప్తున్నారు. అయితే.. ఇండియా - పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లు లేకపోతే ఆసియా కప్‌కు ప్రాధాన్యం ఉండదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే టోర్నమెంట్ వాయిదా పడుతుందని అంచనా వేశాయి. భారత ప్రభుత్వం కూడా పాకిస్థాన్‌తో మ్యాచుల నిర్వహణకు అనుమతి ఇవ్వకపోవడంతో.. ఆసియా కప్ 2025 టోర్నమెంట్‌పై అనిశ్చితి నెలకొంది.

Next Story