ఇండోనేసియా మాస్టర్స్‌లో సింధుకు షాక్.. క్వార్టర్స్‌లో పరాజయం

by Harish |

ఇండోనేసియా మాస్టర్స్‌లో సింధుకు షాక్.. క్వార్టర్స్‌లో పరాజయం
X

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె ఓడిపోయి ఇంటిదారిపట్టింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఆమెపై 13-21, 17-21 తేడాతో చైనాకు చెందిన చెన్ యు ఫీ గెలిచింది. తొలి గేములో సింధు పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ, రెండో గేములో పుంజుకుని చాలా సేపు ఆధిపత్యం ప్రదర్శించింది. ఆ లీడ్‌ను కాపాడుకోవడంలో విఫలమై మ్యాచ్‌ను ప్రత్యర్థికి సమర్పించింది. పురుషుల సింగిల్స్‌లో లక్ష్యసేన్ కూడా నిష్ర్కమించాడు. క్వార్టర్స్‌లో సేన్ 18-21,20-22తో థాయిలాండ్‌కు చెందిన పనిట్చాఫోన్ చేతిలో చిత్తయ్యాడు. 46 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సేన్ విజయం కోసం శ్రమించాడు. ప్రత్యర్థిని టెన్షన్ పెట్టాడు. కానీ, ఫలితం దక్కలేదు. రెండు గేముల్లోనూ పోరాడి ఓడాడు. సింధు, లక్ష్యసేన్ నిష్ర్కమణతో ఈ టోర్నీలో భారత్ ప్రాతినిధ్యం ముగిసింది.


Next Story