దులీప్ ట్రోఫీలో ఆడితేనే.. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఛాన్స్!

by Geesa Chandu |

భారత్ లో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం.. బీసీసీఐ బుధవారం (ఆగస్టు 14) జట్లను ప్రకటించింది. త్వరలో రాబోయే మ్యాచ్ ల కోసం 4 స్క్వాడ్ లను ఎంపిక చేసింది బీసీసీఐ.

దులీప్ ట్రోఫీలో ఆడితేనే.. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ ఛాన్స్!
X

దిశ, వెబ్ డెస్క్: భారత్ లో జరిగే ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ కోసం.. బీసీసీఐ బుధవారం (ఆగస్టు 14) జట్లను ప్రకటించింది. త్వరలో రాబోయే మ్యాచ్ ల కోసం 4 స్క్వాడ్ లను ఎంపిక చేసింది బీసీసీఐ. ఇందులో టీమ్ ఏ, టీమ్ బి, టీమ్ సి, టీమ్ డి జట్లకు వరుసగా శుభ్ మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్లుగా ఉంటూ.. జట్టును నడిపిస్తారు. అయితే ఈ టోర్నీ తొలి రౌండ్ మాత్రం సెప్టెంబర్ 5 న ప్రారంభం కాబోతుంది. స్వదేశంలో సెప్టెంబర్ 19 నుంచి భారత్, బంగ్లా తో రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. కాగా భారత టెస్ట్ జట్టులో స్థానం దక్కాలంటే మాత్రం ఈ ట్రోఫీ కీలకంగా మారబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదే విషయాన్ని గురించి బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ.." టెస్ట్ జట్టులో ఆడబోయే స్క్వాడ్ అంత సిద్ధం. ఇంకా రెండు లేదా మూడు స్థానాలే మిగిలి ఉన్నాయి. ఈ స్థానాల కొరకు అజిత్ అగార్కర్ ఆధ్వర్యంలో ని సెలక్షన్ కమిటీ ఈ దులీప్ ట్రోఫీని చూస్తారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ డైరెక్ట్ గా టెస్ట్ సిరీస్ ఆడతారు. జస్ప్రీత్ బుమ్రా మాత్రం న్యూజిలాండ్ సిరీస్ లో భారత్ జట్టుతో పాల్గొంటాడు. భవిష్యత్ లో, రానున్న రోజుల్లో జట్టుకు కీలక టెస్ట్ మ్యాచ్ లు ఉన్నట్లు ఆయన తెలిపారు, ఈ మ్యాచ్ లు మాత్రం భారత్ కు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు అర్హత సాధించడానికి కీలకం కాబోతున్నట్లు" అయన వెల్లడించారు.

అయితే.. దులీప్ ట్రోఫీ నుంచి రెస్ట్ తీసుకున్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవి చంద్రన్ అశ్విన్ నేరుగా బంగ్లా తో ఆడే టెస్ట్ సిరీస్ కు అందుబాటులోకి వస్తారు. గాయం నుంచి ఇటీవలే కోలుకున్న రిషబ్ పంత్ తో పాటు.. ఓపెనర్ యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా స్థానాలు దాదాపు ఖాయమనే చెప్పాలి. ఇంకా స్టార్ పేసర్ సిరాజ్ ఉండటం కూడా పక్కాగా కనిపిస్తుంది. అయితే దులీప్ ట్రోఫీ అక్షర్ పటేల్ కు, గైక్వాడ్, సర్ఫరాజ్, రాహుల్, ఆకాష్ దీప్ లకు కీలకం కాబోతున్నాయి.

Next Story