- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇటలీలో వింటర్ ఒలింపిక్స్ అట్టహాసంగా ప్రారంభం
ఇటలీలో 'వింటర్ ఒలింపిక్స్ 2026' ప్రారంభ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ క్రీడా ప్రియులకు అదిరిపోయే శుభవార్త. ఇటలీలో 'వింటర్ ఒలింపిక్స్ 2026' ప్రారంభ వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. మిలాన్‌లోని శాన్ సిరో స్టేడియంలో జరిగిన ప్రారంభ వేడుకల్లో మరియా కారీ, ఆండ్రియా బోసెల్లి వంటి అంతర్జాతీయ తారల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పోటీలో ఉన్న దేశాల నుంచి ఆటగాళ్లందరూ ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 16 క్రీడలలో ఈ పోటీలు జరగబోతున్నట్లు తెలుస్తోంది.
మంచు గడ్డలపై ఈ కార్యక్రమం నిర్వహించడంతో వీటిని వింటర్ ఒలింపిక్స్ అంటారన్న సంగతి తెలిసిందే. సాధారణంగా ఒలింపిక్స్ లాగానే ఈ వింటర్ ఒలింపిక్స్ కూడా నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. ఈ నెల 22వ తేదీ వరకు ఈ వింటర్ ఒలింపిక్స్ కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ క్రీడాలలో ఆల్‌పైన్ స్కీయింగ్, క్రాస్ కంట్రీ స్కీయింగ్ విభాగాలలో ఇండియా కూడా పోటీ పడబోతోంది. కాగా, చరిత్రలో తొలిసారిగా నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో ఏకకాలంలో అథ్లెట్ల కవాతు నిర్వహించారు. ఫిబ్రవరి 22 వరకు జరిగే ఈ క్రీడల్లో 90 దేశాల నుంచి 2,800 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.






