స్కూల్ లో 'డ్యాన్స్'తో అదరగొట్టిన.. ఒలింపిక్ పతక విజేత 'మనుభాకర్'

by Geesa Chandu |

పారిస్ ఒలింపిక్ పతక విజేత.. మను భాకర్ డ్యాన్స్ తో అదరగొట్టింది.

స్కూల్ లో డ్యాన్స్తో అదరగొట్టిన.. ఒలింపిక్ పతక విజేత మనుభాకర్
X

దిశ, వెబ్ డెస్క్: పారిస్ ఒలింపిక్ పతక విజేత.. మను భాకర్ డ్యాన్స్ తో అదరగొట్టింది. ఒక పాఠశాలలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె విద్యార్థినులతో కలిసి స్టేజ్ పై స్టెప్పులు కూడా వేసింది. మను భాకర్ 'కాలా చష్మా' పాటపై డ్యాన్స్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో భాకర్ ను యాజమాన్యం సత్కరించింది. ఈ కార్యక్రమానికి భాకర్ తన తల్లితో కలిసి హాజరైంది. విద్యార్థినులతో కలిసి డాన్స్ చేస్తుండగా.. భాకర్ తల్లి వేదిక పైన, వెనక సీట్లో కూర్చొని చప్పట్లతో భాకర్ ను ప్రోత్సహించింది. ఈ దృశ్యాన్నిస్టేజ్ కింద కూర్చున్న విద్యార్థులు, మొబైల్ లో వీడియో తీయడంతో ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Next Story