- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువ అథ్లెట్ల దయనీయ పరిస్థితి.. ట్రైన్‌లో టాయిలెట్ల వద్ద కూర్చొని
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నేషనల్ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఒడిశా యువ రెజ్లర్లు ట్రైన్‌లో దయనీయ స్థితిలో ప్రయాణించిన సంఘటన వెలుగు చూసింది.

దిశ, స్పోర్ట్స్ : ఉత్తరప్రదేశ్‌లో జరిగిన నేషనల్ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఒడిశా యువ రెజ్లర్లు ట్రైన్‌లో దయనీయ స్థితిలో ప్రయాణించిన సంఘటన వెలుగు చూసింది. టికెట్లు కన్ఫర్మ్ కాకపోవడంతో ఆ యువ అథ్లెట్లు బాత్ రూంల వద్ద కూర్చోవాల్సి వచ్చింది. గడ్డ కట్టె చలిలో వణుకుతూనే వారు ప్రయాణించాల్సి వచ్చింది. ఒడిశాకు చెందిన 10 మంది బాయ్స్, 8 మంది గర్ల్స్ నేషనల్ స్కూల్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లారు. ఒడిశా స్కూల్, ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి పోటీకి అథ్లెట్ల బృందం వెళ్లింది. అథ్లెట్ల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. టికెట్లు కన్మర్మ్ కాకపోవడంతో వారు జనరల్ కంపార్ట్‌మెంట్‌లో బాత్‌రూంల వద్ద కూర్చోని ప్రయాణించాల్సి వచ్చింది. తిరుగు ప్రయాణంలో కూడా వారు ఇదే పరిస్థితిని ఎదుర్కొనట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. టాయిలెట్ల వద్ద అథ్లెట్లు కూర్చున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కనీస ఏర్పాట్లు చేయకపోవడంపై అధికారులపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






