- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వన్డే వరల్డ్ కప్: నేడు సౌతాఫ్రికతా తలపడనున్న భారత జట్టు
ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025లో భాగంగా ఈ రోజు భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ విశాఖపట్నం కేంద్రంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.

దిశ, వెబ్ డెస్క్: ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025(Women's ODI World Cup 2025) లో భాగంగా ఈ రోజు భారత్, సౌతాఫ్రికా (INDW vs RSAW) జట్లు తలపడనున్నాయి. ఈ హైఓల్టేజ్ మ్యాచ్ విశాఖపట్నం కేంద్రంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచుకు ముందు ఇరు జట్లు భారీ విజయాలను అందుకొని వస్తుండగా.. నేటి మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. భారత జట్టు ఇప్పటికే టోర్నీలో గెలుపుతో ఫార్మ్‌ను కొనసాగిస్తోంది. కానీ ఇంకా పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేదు. నేడు జరిగే మ్యాచులో విరామ సమయంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నట్లు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
అలాగే ఈ మ్యాచులో కానీ స్పిన్నర్లు కీలక పాత్ర పోషించవచ్చని తెలుస్తుంది. ఇదిలా ఉంటే భారత జట్టులో కీలక ఆటగాళ్లలో స్మృతి మంధానా, హర్మన్‌ప్రీత్ కౌర్, దీప్తి శర్మలు గత కొద్ది మ్యాచులుగా జట్టు విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే సౌతాఫ్రికా (South Africa) జట్టులో టాజ్మిన్ బ్రిట్స్, నాన్‌కులులెకో మ్లాబా, నడిన్ డి క్లర్క్ ముఖ్య పాత్రలో ఉంటారు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు మంచి అవకాశం దక్కింది. వైజాగ్ వేదికగా జరిగే నేటి మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే హ్యాట్రిక్ విజయం సొంతం కానుండగా.. సౌతాఫ్రికా గెలిస్తే, టోర్నీలో తమ స్థానం బలోపేతం చేసుకుంటుంది.






