టెస్టుల్లో అరుదైన రికార్డు నెలకొల్పిన ఇంగ్లాండ్ బౌలర్

by Harish |
టెస్టుల్లో అరుదైన రికార్డు నెలకొల్పిన ఇంగ్లాండ్ బౌలర్
X

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్‌తో ఇప్పటికే టెస్టు సిరీస్‌లో 2-0తో వెనుకబడిన న్యూజిలాండ్ ఆఖరిదైన మూడో టెస్టులోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. హామిల్టన్ వేదికగా శనివారం ప్రారంభమైన మూడో టెస్టును మెరుగ్గానే ఆరంభించింది. బ్యాటర్లు సమిష్టిగా రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 315/9 స్కోరు చేసింది. కెప్టెన్ టామ్ లాథమ్(63), మిచెల్ సాంట్నర్(50 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించగా.. కేన్ విలియమ్సన్(44), విల్ యంగ్(42) పర్వాలేదనిపించారు. ముందుగా ఓపెనర్లు టామ్ లాథమ్, విల్ యంగ్ తొలి వికెట్‌కు 105 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో కివీస్ భారీ స్కోరుపై కన్నేయగా..ఇంగ్లాండ్ బౌలర్లు పుంజుకుని వరుసగా వికెట్లు తీశారు. మాథ్యూ పాట్స్, అట్కిన్సన్ మూడేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్సె 2 వికెట్లు పడగొట్టాడు.

అట్కిన్సన్ అరుదైన రికార్డు

కివీస్‌పై మూడు వికెట్లు తీయడం ద్వారా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అట్కిన్సన్ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఈ ఏడాదే టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన అతను..అరంగేట్ర సంవత్సరంలో 50కిపైగా వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు 48 వికెట్లతో ఉన్న అట్కిన్సన్.. విల్ యంగ్, మిచెల్, టిమ్ సౌథీలను అవుట్ చేయడం ద్వారా వికెట్ల సంఖ్య 51కి చేరింది. అట్కిన్సన్ కంటే ముందు 1981లో ఆసిస్ పేసర్ టెర్రీ ఆల్డెర్మాన్ 54 వికెట్లు పడగొట్టాడు

Advertisement

Next Story

Most Viewed