షాకింగ్‌...ప్ర‌శాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ ర‌న్ టైం 3.40 గంట‌లా ?

by velandi.Saikiran |   (  Updated:2025-11-04 09:36:56  IST  )

నీల్‌-ఎన్టీఆర్ సినిమా ర‌న్ టైం 3.40 గంట‌లుగా ఉండ‌నుంద‌ట‌. దీంతో ఎన్టీఆర్ తో పాటు చిత్ర బృందం షాక్ తిన్న‌ద‌ని

షాకింగ్‌...ప్ర‌శాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ ర‌న్ టైం 3.40 గంట‌లా ?
X

దిశ‌, వెబ్ డెస్క్‌: జూనియ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నంద‌మూరి వార‌స‌త్వాన్ని ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన ఎన్టీఆర్, త‌న‌కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ఎన్టీఆర్‌, ఇటీవ‌లే దేవ‌ర సినిమాతో మంచి స‌క్సెస్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు ప్ర‌శాంత్ నీల్ తో డ్రాగ‌న్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫైన‌ల్ కాలేదు కానీ, డ్రాగ‌న్ అనే మాత్రం వినిపిస్తోంది. అయితే, ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ వ‌చ్చింది.

నీల్‌-ఎన్టీఆర్ సినిమా ర‌న్ టైం 3.40 గంట‌లుగా ఉండ‌నుంద‌ట‌. దీంతో ఎన్టీఆర్ తో పాటు చిత్ర బృందం షాక్ తిన్న‌ద‌ని టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సినిమాను రెండు పార్టులుగా తీయాల‌ని అనుకుంటున్నార‌ట‌. అంతేకాదు, ఈ రెండు పార్టుల‌ను ఒకేసారి షూటింగ్ చేయాల‌ని డిసైడ్ అయిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. స‌లార్‌, కేజీఎఫ్ లా కాకుండా సింగిల్‌గానే సినిమా తీయాల‌ని అనుకుంటున్నార‌ట‌. కానీ, ఇప్పుడు ర‌న్ టైం పెర‌గ‌డంతో రెండు పార్టులుగా తీసేందుకు సిద్ధం అవుతున్నాడ‌ట ప్ర‌శాంత్ నీల్‌.

Next Story