- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
RCB తొక్కిసలాట ఉదంతం.. వరల్డ్ కప్ విక్టరీ పరేడ్ లేనట్టే
జూన్ 4న జరిగిన RCB విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఉదంతం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జూన్ 4న జరిగిన RCB విక్టరీ పరేడ్ తొక్కిసలాట ఉదంతం తెలిసిందే. ఆ ఘటనలో 11 మంది చనిపోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ దుర్ఘటనను దృష్టిలో ఉంచుకొని ICC మహిళలు వన్డే వరల్డ్ కప్ కైవసం చేసుకున్న భారత జట్టు విక్టరీ పరేడ్ కు దూరం అయింది. RCB ఘటన నేపథ్యంలో ఎలాంటి విక్టరీ పరేడ్ నిర్వహించడం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఆ ఘటన తమను తీవ్రంగా కలచి వేసిందని, భద్రతా కారణాల దృష్ట్యా ర్యాలీ చేపట్టడం లేదని పేర్కొంది.
అయితే కప్ గెలిచిన మహిళల జట్టును రేపు ప్రధాని నరేంద్ర మోడీ తన నివాసంలో సన్మానిస్తారు. ఇదిలా ఉంటే తొలిసారి కప్ గెలిచినప్పటికీ విక్టరీ పరేడ్ చేపట్టకపోవడంపై తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. మహిళలు కాబట్టే చిన్నచూపు చూస్తున్నారని, అదే పురుషుల జట్టు అయితే వేలమంది పోలీసులను రంగంలోకి దింపి అయినా ర్యాలీ చేపట్టేవారిని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






