రోహిత్ లేడు.. కోహ్లీ లేడు.. అయినప్పటికీ డిమాండ్ తగ్గలేదు.. భారత్, ఆసిస్ మ్యాచ్‌ టికెట్లు సోల్డ్ ఔట్

by Harish |

ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా ఈ నెలలోనే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

రోహిత్ లేడు.. కోహ్లీ లేడు.. అయినప్పటికీ డిమాండ్ తగ్గలేదు.. భారత్, ఆసిస్ మ్యాచ్‌ టికెట్లు సోల్డ్ ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : ప్రస్తుతం వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా ఈ నెలలోనే వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. భారత్, ఆసిస్ మ్యాచ్‌లకు భారీ క్రేజ్ నెలకొంది. అందులోనూ ఈ నెల 31న మెల్‌బోర్న్ వేదికగా జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు భారీ డిమాండ్ ఉంది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన పబ్లిక్ టికెట్స్ అన్నీ సేల్ అయినట్టు క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) సోమవారం ప్రకటించింది.

‘మెల్‌బోర్న్ టీ20 కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ సిరీస్‌పై ఆసక్తి ఉందనే చెప్పే సూచిక ఇది. భారత్, ఆసిస్ మ్యాచ్‌పై అభిమానులు ఇంత ఉత్సాహం చూపించడం చూసి మేము థ్రిల్ అయ్యాం.’అని సీఏ సీఈఏ టాడ్ గ్రీన్ బర్గ్ తెలిపారు. ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్ క్రికెట్ స్టేడియం అతిపెద్దది. ఆ గ్రౌండ్ కెపాసిటీ 95 వేలు. ఇతర మ్యాచ్‌ల టికెట్లు కూడా సోల్డ్ అవుట్‌కు దగ్గరగా వచ్చినట్టు సమాచారం. ఇప్పటివరకు లక్షా 75 వేలు టికెట్లు అమ్ముడుపోయినట్టు సీఏ తెలిపింది. సిరీస్ ప్రారంభానికి రెండు వారాల ముందుగానే టికెట్లు సేల్ ఔట్ అవడం భారత్, ఆసిస్ పోరుపై ఆసక్తిని తెలియజేస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి ప్లేయర్లు లేకపోయినప్పటికీ భారీ డిమాండ్ నెలకొనడం గమనార్హం.


Next Story