- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశ్వవిజేతగా భారత్.. విక్టరీ పరేడ్‌పై బీసీసీఐ షాకింగ్ డెసిషన్
భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : భారత మహిళల క్రికెట్ జట్టు ఐసీసీ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.ఫైనల్‌లో సౌతాఫ్రికాను ఓడించి తొలిసారిగా ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. దేశం మొత్తం ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంది. విక్టరీ పరేడ్‌లో ఈ అపూర్వ విజయాన్ని అభిమానులతో పంచుకోవాలని ఒకవైపు భారత జట్టు, మరోవైపు ప్లేయర్లను అభినందించాలని ఫ్యాన్స్ అనుకుంటున్న వేళ బీసీసీఐ షాకింగ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతానికి విక్టరీ పరేడ్ ఆలోచన లేదని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు. ‘ఐసీసీ మీటింగ్ కోసం దుబాయ్‌కు వెళ్తున్నా. చాలా మంది అధికారులు వస్తున్నారు. తిరిగి వచ్చాక విక్టరీ పరేడ్ గురించి ఆలోచిస్తాం.’అని తెలిపారు.
గతేడాది టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ముంబైలో భారత పురుషుల జట్టుకు విక్టరీ పరేడ్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, చాంపియన్స్ ట్రోఫీ విజయం తర్వాత మాత్రం బస్ పరేడ్ నిర్వహించలేదు. ఇప్పుడు మహిళల జట్టుకు కూడా విక్టరీ పరేడ్ నిర్వహించడంపై బీసీసీఐ సందేహిస్తుంది. ఈ ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకలో తొక్కిసలాట చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయోత్సవ వేడుక నిర్వహించడానికి బోర్డు ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం. ఐసీసీ మీటింగ్ తర్వాతే దీనిపై ఓ క్లారిటీ రానుంది.






