రో-కోలను రిప్లేస్ చేయగలమా?.. శాంసన్ కూడా అంతే : రియాన్ పరాగ్

by Harish |

రో-కోలను రిప్లేస్ చేయగలమా?.. శాంసన్ కూడా అంతే : రియాన్ పరాగ్
X

దిశ, స్పోర్ట్స్ : రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజూ శాంసన్‌ను రిప్లేస్ చేయడం కష్టమని ఆ జట్టు కెప్టెన్ రియాన్ పరాగ్ తెలిపాడు. చాలా కాలంపాటు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన శాంసన్ ఈ సీజన్‌లో చెన్నయ్ సూపర్ కింగ్స్‌కు మారిపోయాడు. గురువారం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పరాగ్.. దీనిపై స్పందించాడు. ‘శాంసన్ భయ్యాను భర్తీ చేయాలని మేము ఆలోచించం. అతనిలాంటి నైపుణ్యాలు ఉన్న ఆటగాడి కోసం చూస్తాం. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ‌లకు రిప్లేస్‌మెంట్ ఉందా?. శాంసన్ భయ్యాకు కూడా ప్రత్యామ్నాయం లేదు. అతను చాలా మంచి ప్లేయర్’అని పరాగ్ చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో కొత్త ప్రణాళికలతో సాగుతామని, మ్యాచ్‌లను మెరుగ్గా ముగించడంపై ఫోకస్ పెట్టినట్టు తెలిపాడు. అలాగే, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి పరాగ్ ఓ సూచన చేశాడు. మీడియాకు దూరంగా ఉండి ఆటను ఆస్వాదించాలని చెప్పాడు. ‘అతనికి ఇంకా 15-16 ఏళ్లే. బాగా ఆడుతున్నాడు. దేశానికి గర్వకారణంగా నిలిచే సత్తా అతనిలో ఉంది.’అని తెలిపాడు. ఈ నెల 30న చెన్నయ్ సూపర్ కింగ్స్‌తో ఆడటం ద్వారా రాజస్థాన్ ఈ సీజన్‌ను మొదలుపెట్టనుంది.


Next Story