- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బుమ్రాకు భువనేశ్వర్ మద్దతు.. కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ బౌలర్
ఇటీవల ఇంగ్లాండ్ టూరులో భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మూడు టెస్టులే ఆడిన విషయం తెలిసిందే.

దిశ, స్పోర్ట్స్ : ఇటీవల ఇంగ్లాండ్ టూరులో భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా మూడు టెస్టులే ఆడిన విషయం తెలిసిందే. వర్క్‌లోడ్ నిర్వహణలో భాగంగా టీమ్ మేనేజ్‌మెంట్ అతన్ని మూడు మ్యాచ్‌లకే పరిమితం చేసింది. అయితే, పలువురు మాజీ క్రికెటర్లు బుమ్రా పనిభారం నిర్వహణపై విమర్శలు చేశారు. ఈ క్రమంలో భారత సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్.. బుమ్రాకు మద్దతుగా నిలిచాడు. అతని బౌలింగ్ యాక్షన్ వల్ల గాయాలు అయ్యే ప్రమాదం ఉందన్నాడు. కాబట్టి, బుమ్రాకు వర్క్‌లోడ్ నిర్వహణ అవసరమేనని చెప్పాడు. ‘బుమ్రా చాలా కాలంగా మూడు ఫార్మాట్లు ఆడుతున్నాడు. ఇది ఎవరికైనా చాలా కష్టం. అలాగే, అతని బౌలింగ్ యాక్షన్ వల్ల గాయాల పాలవుతాడు. బుమ్రా క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తాడు.కాబట్టి, అతనిపై మానసిక, శారీరక ఒత్తిడి ఉంటుంది. ఓ ఆటగాడైనా సుదీర్ఘ కెరీర్‌ను కలిగి ఉండాలంటే వర్క్‌లోడ్ నిర్వహణ తప్పనిసరి.’అని తెలిపాడు. ఓ ఆటగాడు ఐదు మ్యాచ్‌లు ఆడకపోయినా మూడు మ్యాచ్‌ల్లో భారీ ప్రభావం చూపించినా సరిపోతుందన్నాడు. బుమ్రా కూడా అదే చేశాడని చెప్పుకొచ్చాడు. కాగా, మూడు టెస్టుల్లో బుమ్రా 14 వికెట్లు తీశాడు. అందులో రెండుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేయడం విశేషం.






