Champions Trophy : పాక్‌ జట్టుకు ఆ అర్హతే లేదు.. సొంత జట్టుపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

by Harish |

చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Champions Trophy : పాక్‌ జట్టుకు ఆ అర్హతే లేదు.. సొంత జట్టుపై మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, స్పోర్ట్స్ : చాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పాక్ జట్టుకు ఫైనల్ ఆడే అర్హత లేదని వ్యాఖ్యానించాడు. తాజాగా ఓ మీడియాతో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ.. భారత్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా సెమీస్‌కు చేరుకునే అవకాశాలు ఉన్నాయని తెలిపాడు. ‘పాక్ జట్టులో చాలా లోపాలు ఉన్నాయి. బౌలింగ్ కష్టాల్లో ఉంది. స్పిన్నర్లు లేరు. ఓపెనర్లు ఇబ్బందిపడుతున్నారు. కెప్టెన్, సెలెక్టర్లు ఏమనుకున్నారో తెలియదు. అలాంటి జట్టును ఎంపిక చేయడానికి వెనుక ఉన్న కారణం తెలియదు. చైర్మన్ ఎక్కువగా క్రికెట్ ఆడలేదు. ఆయనకు విషయాలు అర్థం కావు. అందుకే, అలాంటి జట్టుకు ఆమోదం తెలిపి ఉండొచ్చు. టీమ్ ఇండియా స్పష్టమైన ఫేవరెట్‌గా కనిపిస్తున్నది. ఫైనల్ ఆడేందుకు వారికి అర్హత ఉంది. పాక్ విషయంలో అలా చెప్పలేను. పాకిస్తాన్ సెమీస్ చేరుకుంటే అతిపెద్ద విజయం.’ అని కమ్రాన్ అక్మల్ చెప్పుకొచ్చాడు.


Next Story