స్వేచ్ఛ లేదు, చెప్పమన్నదే చెప్పాలి: క్రికెట్ బ్రాడ్‌కాస్టింగ్ గుట్టువిప్పిన మాజీ క్రికెటర్

by Kema Shiva Kumar |

క్రికెట్ కామెంటరీ వెనుక ఉన్న దిమ్మతిరిగే నిజాలను బయటపెట్టిన మాజీ భారత క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణణ్ ఎట్టకేలకు బయటపెట్టారు.

స్వేచ్ఛ లేదు, చెప్పమన్నదే చెప్పాలి: క్రికెట్ బ్రాడ్‌కాస్టింగ్ గుట్టువిప్పిన మాజీ క్రికెటర్
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్‌ (Cricket)లో మైక్ పట్టుకుని సరదాగా ప్యాషన్‌తో చేసే కామెంటరీ కఠినమైన నియమాలు, నియంత్రణలపై మాజీ భారత క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణణ్ (Laxman Sivaramakrishnan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లైవ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు కామెంట్లు చేసే మాజీ ఆటగాళ్లకు పూర్తి స్వేచ్ఛ ఉండదని అన్నారు. క్రికెట్ బోర్డులు (Criket Boards), బ్రాడ్‌కాస్ట్ చేసే ప్రసార సంస్థలు పెట్టిన రూల్స్‌కు లోబడే మాట్లాడాల్సి ఉంటుందన్నారు.

ముందే నోరు నొక్కేస్తారు..

అయితే, చాలామంది కామెంటరీ బాక్స్‌లో కూర్చుని అద్భుతంగా మాట్లాడుతున్నారని అభిమానులు అనుకుంటారని లక్ష్మణ్ శివరామకృష్ణన్ అన్నారు. కానీ అక్కడ అసలు స్వేచ్ఛే ఉండదని తెలిపారు. మైక్ ఆన్ చేయక ముందే బ్రాడ్‌కాస్టర్లు, బోర్డు ప్రతినిధులు తమ కొన్ని స్పష్టమైన గైడ్‌లైన్స్ ఇస్తారని పేర్కొన్నారు. ఫలానా ఆటగాడిని ఎక్కువగా విమర్శించకూడదని, ఫలానా వివాదాస్పద నిర్ణయం, పిచ్ (Pitch) నాణ్యత గురించి నెగెటివ్‌గా మాట్లాడకూడదంటూ ముందే నోరు నొక్కేస్తారని కామెంట్ చేశారు. తాము కేవలం వారు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను, వారు కోరుకున్న అభిప్రాయాలనే మైక్ ముందు చెప్పాల్సి వస్తుందని వాపోయారు.

లీగ్స్, బోర్డుల ఒత్తిడి..

ప్రస్తుత క్రికెట్ యుగంలో ముఖ్యంగా భారీ టీ20 లీగ్స్, ద్వైపాక్షిక సిరీస్‌ల సమయంలో కామెంటరీపై నియంత్రణ మరీ ఎక్కువగా ఉందని లక్ష్మణ్ శివరామకృష్ణణ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిష్పక్షపాతంగా లోపాలను ఎత్తిచూపాలని చూస్తే.. తదుపరి సిరీస్‌లకు కామెంటరీ కాంట్రాక్టుల నుంచి తొలగిస్తామనే పరోక్ష హెచ్చరికలు చేశారని ఆరోపించారు. నిజాయితీగా రివ్యూ ఇవ్వాలనుకునే మాజీ ఆటగాళ్లకు ఈ నోరు నొక్కే ఉత్తర్వులు నరకంలా మారుతున్నాయని, కేవలం కెరీర్ కోసం, డబ్బుల కోసం చాలామంది బ్రాడ్‌కాస్టర్లు చెప్పినట్లే తలలూపుతున్నారని ఆయన విమర్శించారు.

Next Story