- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ireland vs Zimbabwe : కష్టపడి ఫోర్ ఆపి.. ఐదు రన్స్ ఇచ్చాడు.. జింబాబ్వే, ఐర్లాండ్ టెస్టులో ఆసక్తికర ఘటన
జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే, ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్టులో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. జింబాబ్వే ఫీల్డర్ బంతి ఫోర్ వెళ్లకుండా ఆపినప్పటికీ ఐర్లాండ్‌కు ఐదు పరుగులు వచ్చాయి. అసలేం జరిగిందంటే.. ఐర్లాండ్ రెండో ఇన్నింగ్స్‌లో రిచర్డ్ ఎంగర్వ వేసిన 18వ ఓవర్‌లో రెండో బంతిని మెక్‌బ్రైన్ కవర్ షాట్ ఆడాడు. ఫీల్డర్ చటారా చాలా కష్టపడి ఆ బంతిని ఫోర్ వెళ్లకుండా బౌండరీ లైన్ వద్ద ఆపాడు. అయితే, అతను అదుపుతప్పి బౌండరీ లైన్ అవతలకు వెళ్లిపోయాడు. అతను తిరిగొచ్చి బంతిని త్రో చేసేలోపు మెక్‌బ్రైన్, టక్కర్ ఐదు పరుగులు తీశారు. ఆ బంతి బౌండరీ వెళ్లినా నాలుగు పరుగులే వచ్చేవి. చటారా చేసిన పని వల్ల ఐదు పరుగులు ఇచ్చాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
McBrine hits Ngarava for 5⃣!
— Cricket Ireland (@cricketireland) July 28, 2024
Yep, you read that right...
▪️ Ireland 86-5 (19 overs)
▪️ Zimbabwe 197 (71 overs)
▪️ Ireland 250 (58.3 overs)
▪️ Zimbabwe 210 (71.3 overs)
WATCH (Ireland/UK): https://t.co/DeHsISzoPw
WATCH (Rest of world): https://t.co/HZ1cGTFoHv
SCORE:… pic.twitter.com/0Rr6GRZoa7
మరోవైపు, ఏకైక టెస్టులో ఆదివారం ఐర్లాండ్ విజయం సాధించింది. జింబాబ్వే నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, ఛేదనలో ఒక దశలో ఆ జట్టు 21/4 స్కోరుతో కష్టాల్లో కూరుకుపోయింది. ఈ పరిస్థితుల్లో టక్కర్(56), ఆండ్రీ మెక్‌బ్రైన్(55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఐర్లాండ్‌కు ఇది రెండో టెస్టు విజయం. దీంతో ఐర్లాండ్ జట్టు రెండో టెస్టు విజయాన్ని అందుకుంది. అలాగే, టెస్టుల్లో ఛేదనలో 25 పరుగుల్లోపే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన తొలి జట్టుగా ఐర్లాండ్ రికార్డు నెలకొల్పింది.






