రుతురాజ్ పై గంభీర్ మళ్ళీ కుట్రలు...ఆసియా కప్ లో నో ఛాన్స్ !

by velandi.Saikiran |

ఆసియా కప్ 2025 ( Asia Cup 2025) టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ

రుతురాజ్ పై గంభీర్ మళ్ళీ కుట్రలు...ఆసియా కప్ లో నో ఛాన్స్ !
X

దిశ, వెబ్ డెస్క్: ఆసియా కప్ 2025 ( Asia Cup 2025) టోర్నమెంట్ షెడ్యూల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఈ మ్యాచ్ లు కొనసాగనున్నాయి. మొత్తం 19 t20 మ్యాచ్ లు ఈ టోర్నమెంట్లో నిర్వహించబోతున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్లో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడుసార్లు మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉంది. సెప్టెంబర్ 14వ తేదీన లీగ్ దశలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఆసియా కప్ 2025 టోర్నమెంట్ అతి త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో జట్టులోకి ఎవరిని తీసుకుంటారు అనే దాని పైన చర్చ జరుగుతోంది.

ఈ తరుణంలో.. తెరపైకి రుతురాజు గైక్వాడ్ ( Ruturaj Gaikwad ) పేరు వచ్చింది. రుతురాజు గైక్వాడ్ ను జట్టులోకి తీసుకోవాలని చాలా డిమాండ్లు వస్తున్నాయి. అయితే... రుతురాజు గైక్వాడ్ జట్టులోకి రాకుండా గౌతమ్ గంభీర్ ( Gautam Gambhir) కుట్రలు పన్నుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ( CSK) ఆడిన ఏ ఒక్క ప్లేయర్ ను టీమిండియాలోకి రాకుండా మొదటి నుంచి గౌతమ్ గంభీర్ అడ్డుకుంటున్నట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

మహేంద్ర సింగ్ ధోనీ ( Ms Dhoni) వర్సెస్ గౌతమ్ గంభీర్ మధ్య గతంలో వివాదాలు ఉన్న సంగతి తెలిసిందే. 2011 ప్రపంచ కప్ సమయంలో.. తనకంటే ధోని కి ఎక్కువ పేరు వచ్చిందని గంభీర్ పగ పెంచుకున్నారట. అందుకే ధోని సారధ్యంలో నడుస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున.. ఆడుతున్న రుతురాజును తొక్కేసేందుకు గౌతమ్ గంభీర్ ఇప్పుడు కోచ్ హోదాలో ఉండి కుట్రలు పన్నుతున్నారని చెబుతున్నారు. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ జట్టులో అతని పేరు లేకుండా.. తెర వెనుక అన్నీ నడిపిస్తున్నారట గంభీర్. అయితే దీనిపై చెన్నై అభిమానులు సీరియస్ అవుతున్నారు.

Next Story