నాలుగు టెస్ట్ కు ముందు టీమిండియాకు మరో షాక్.. నితీష్ కు గాయం!

by velandi.Saikiran |

టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ

నాలుగు టెస్ట్ కు ముందు టీమిండియాకు మరో షాక్.. నితీష్ కు గాయం!
X

దిశ, వెబ్ డెస్క్ : టీమిండియా ( Team India) వర్సెస్ ఇంగ్లాండ్ ( England) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియా కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. టీమిండియా ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి (nitish kumar reddy) తీవ్ర గాయం అయింది. దీంతో అండర్సన్ - సచిన్ టెండూల్కర్ ట్రోఫీ (Anderson - Sachin Tendulkar Trophy) నుంచి నితీష్ కుమార్ రెడ్డి వైదొలగినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆదివారం రోజున ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొనే కంటే ముందు అతను జిమ్ లో కసరత్తులు చేశాడు. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ రెడ్డికి తీవ్ర గాయం అయిందని అంటున్నారు. స్కానింగ్ తీయగా లిగ్మెంట్ దెబ్బతిన్నట్లు... నేషనల్ మీడియా పేర్కొంది. దాంతో దాదాపు 15 రోజులపాటు నితీష్ కుమార్ రెడ్డికి రెస్ట్ అవసరమని వైద్యులు వెల్లడించారట. దీంతో మిగిలిన రెండు టెస్టులకు నితీష్ కుమార్ రెడ్డి దూరం కాబోతున్నట్లు చెబుతున్నారు. ఒకవేళ ఇదే జరిగితే టీమ్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలినట్లేనని అంటున్నారు.

Next Story