టీమిండియాకు షాక్?.. తెలుగు కుర్రాడు ఆసిస్‌తో తొలి టీ20 ఆడటం డౌటే

by Harish |

ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాకు మరో షాకింగ్ న్యూస్.

టీమిండియాకు షాక్?.. తెలుగు కుర్రాడు ఆసిస్‌తో తొలి టీ20 ఆడటం డౌటే
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియాకు మరో షాకింగ్ న్యూస్. ఈ నెల 29న జరిగే తొలి టీ20కి ఆల్‌రౌండర్, తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆడటం అనుమానమే. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో గాయపడిన విషయం తెలిసిందే. ఎడమ కాలు తొడకు గాయమైంది. దీంతో అతను మూడో వన్డే ఆడటం లేదని, నితీశ్‌ను బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నట్టు బీసీసీఐ వెల్లడించింది. గాయం మరి తీవ్రమైనది కాదని సమాచారం. కానీ, తొలి టీ20 నాటికి అతను పూర్తిగా కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. నితీశ్ జట్టుతోనే ప్రయాణించనున్నాడు. కానీ ప్రస్తుతానికి అతను తొలి టీ20 ఆడతాడా?లేదా? అన్నది స్పష్టంగా తెలియదు. టీమ్ మేనేజ్‌మెంట్ ఎప్పటి నుంచో హార్దిక్ పాండ్యాలాంటి పేస్ ఆల్‌రౌండర్ కోసం చూస్తున్నది. అందుకు నితీశ్ సరిపోతాడని టీమ్ మేనేజ్‌మెంట్ చెప్పుకోస్తోంది. ఒక వేళ అతను తొలి టీ20కి దూరమైతే నితీశ్ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారో చూడాలి.


Next Story