- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీతా అంబానీ గొప్ప మనసు.. అంధుల మహిళా క్రికెట్ జట్టుకు భారీ నజరానా
అంధుల మహిళా క్రికెట్ జట్టుకు నీతా అంబానీ బంపర్ ఆఫర్

దిశ, వెబ్ డెస్క్ : 2025లో తొలిసారిగా నిర్వహించిన మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌లో భారత్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. శ్రీలంకలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్‌ను 7 వికెట్ల తేడాతో ఓడించి ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఈ ఘన విజయం సాధించిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టును నేడు ముంబైలో జరిగిన 'యునైటెడ్ ఇన్ ట్రయంఫ్' కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్‌పర్సన్ నీతా అంబానీ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా జట్టుకు ఫౌండేషన్ తరఫున రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. తమకు ఇంత పెద్ద సహాయం అందించినందుకు ఆటగాళ్లు నీతా అంబానీకి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీతోపాటు, బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మతో పాటు పలువురు సినీ, క్రీడారంగ ప్రముఖులు పాల్గొన్నారు. వీరి విజయం అంధుల క్రీడలకు, మహిళల సాధికారతకు గొప్ప ప్రేరణగా నిలిచిందని ఈ సందర్భంగా నీతా అంబానీ కొనియాడారు.






