నిఖత్ జరీన్‌కు షాక్.. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌కు దూరం

by Harish |

నిఖత్ జరీన్‌కు షాక్.. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌కు దూరం
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బాక్సర్, రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన నిఖత్ జరీన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ ఏడాది జరిగే ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌‌కు దూరమైంది. పటియాలాలో జరిగిన జాతీయ బాక్సింగ్ ట్రయల్స్‌లో ఆమె ఓడిపోవడంతో ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనాలనే ఆహె ఆశలు గల్లంతయ్యాయి. 51 కేజీల కేటిగిరీలో పాల్గొన్న ఆమె గురువారం జరిగిన సెమీస్ మ్యాచ్‌లో సాక్షి చౌదరి చేతిలో 4-1తేడాతో ఓడిపోయింది. ఫైనల్‌లో మీనాక్షి హుడాతో సాక్షి తలపడనుంది. ఇందులో గెలిచిన బాక్సర్లు ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్‌కు అర్హత సాధిస్తారు. ఇటీవల జరిగిన ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌లో ఓడిపోవడంతో నిఖత్ నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కూడా ఇప్పటికే కోల్పోయింది. కామన్వెల్త్ గేమ్స్-2022‌లో నిఖత్ గోల్డ్ మెడల్ సాధించగా.. ఆసియా క్రీడలు -2023లో కాంస్యం గెలిచింది.


Next Story