వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం దిశగా నిఖత్ జరీన్.. క్వార్టర్స్‌కు క్వాలిఫై

by Harish |

తెలంగాణ బాక్సర్, రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో హవా చాటుతోంది.

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పతకం దిశగా నిఖత్ జరీన్.. క్వార్టర్స్‌కు క్వాలిఫై
X

దిశ, స్పోర్ట్స్ : తెలంగాణ బాక్సర్, రెండుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన నిఖత్ జరీన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో హవా చాటుతోంది. 51 కేజీల కేటగిరీలో బరిలోకి దిగిన ఆమె వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లి పతకానికి చేరువైంది. మంగళవారం జరిగిన బౌట్‌లో నిఖత్ 5-0 తేడాతో జపాన్ బాక్సర్ యునా నిషికానాను మట్టికరిపించింది. ప్రత్యర్థి నుంచి గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్నప్పటికీ ఏకపక్ష విజయం సాధించింది. మొదట రౌండ్‌లో నిఖత్‌కు షాక్ తప్పలేదు. ప్రత్యర్థి 3-2తో ఆ రౌండ్ గెలిచింది. ఆ తర్వాత నిఖత్ బలంగా పుంజుకుంది. తన ఎటాకింగ్‌ను మార్చుకుంది. కచ్చితమైన పంచ్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసింది. మిగతా రెండు రౌండ్లలోనే ఆధిపత్యం ప్రదర్శించడంతో ఐదుగురు నిఖత్ వైపే మొగ్గుచూపారు. సెమీస్‌కు చేరుకుంటే కనీసం బ్రాంజ్ మెడల్ ఖాయమవుతుంది. పురుషుల 80 కేజీల కేటగిరీలో భారత బాక్సర్ లక్ష్య చాహర్ ఇంటిదారిపట్టాడు. రెండో రౌండ్‌లో అతను పరాజయం పాలయ్యాడు. ఫ్రాన్స్‌కు చెందిన యెజెర్లివన్ సీజన్ చేతిలో 3-0 తేడాతో పోరాడి ఓడిపోయాడు.

Next Story