- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్’ విజేత కిర్గియోస్
‘బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్’ మ్యాచులో నిక్ కిర్గియోస్ విజేతగా నిలిచాడు. సబలెంకపై వరుస సెట్లలో నెగ్గాడు.

దిశ, స్పోర్ట్స్: దశాబ్దాల తర్వాత కేవలం జరిగిన ‘బ్యాటిల్ ఆఫ్ సెక్సెస్’ మ్యాచులో పురుష ప్లేయర్ నిక్ కిర్గియోస్ సునాయాస విజయం సాధించాడు. ఒకప్పుడు పురుషులపై మహిళలు గెలవగలరని నిరూపించేందుకు జరిగిన ఈ మ్యాచ్.. ఈసారి కేవలం బలంతో టెక్నిక్‌ను ఓడించొచ్చా? అనే అంశంపైనే జరిగినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచులో వరల్డ్ నెంబర్ వన్ అరీనా సబలెంక, ఆసీస్ స్టార్ నిక్ కిర్గియోస్ తలపడ్డారు. ఈ మ్యాచు కోసం ప్రత్యేకంగా టెన్నిస్ కోర్టును తయారు చేశారు. రూల్స్ మార్చి సబలెంక వైపు కోర్టు సైజ్ తగ్గించారు కూడా. అలాగే ప్లేయర్లు ఒక్కసారే సర్వ్ చేసేలా నిబంధనలు సడలించారు.
అభిమానులు ఉత్సాహంగా ఎదురు చూసిన ఈ మ్యాచ్.. చివరకు సాధారణంగా ముగిసింది. తొలి రెండు సెట్లను 3-6, 3-6 తేడాతో తన ఖాతాలో వేసుకున్న కిర్గియోస్ విజేతగా నిలిచాడు. రెండో సెట్ ఆరంభంలో సబలెంక ఆధిపత్యంలోకి దూసుకెళ్లినా.. చివరకు నిక్ పుంజుకొని మ్యాచ్ తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సబలెంక.. డిఫరెంట సైజు కోర్టులో, పురుషుడితో ఆడటం చాలా విభిన్నమైన అనుభూతినిచ్చిందని పేర్కొంది. తను బాగా ఆడానని, నిక్ చివరకు అలసిపోయాడని చెప్పింది. కుదిరితే మరోసారి అతనితో తలపడాలని ఉందని వెల్లడించింది.






