నిన్న రిటైర్మెంట్.. నేడు కెప్టెన్సీ ఆఫర్.. పూరన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ముంబై ఇండియన్స్

by Harish |

వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.

నిన్న రిటైర్మెంట్.. నేడు కెప్టెన్సీ ఆఫర్.. పూరన్‌కు గుడ్ న్యూస్ చెప్పిన ముంబై ఇండియన్స్
X

దిశ, స్పోర్ట్స్ : వెస్టిండీస్ స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్ మంగళవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. 29 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాకిచ్చాడు. అయితే, ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన మరుసటి ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతనికి బంఫర్ ఆఫర్ ఇచ్చింది. అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్(ఎంఎల్‌సీ)‌ టోర్నీలో తమ ఫ్రాంచైజీ అయిన ఎంఐ న్యూయార్క్‌ జట్టుకు పూరన్‌ను కెప్టెన్‌గా నియమించింది. కీరన్ పొలార్డ్ నుంచి అతను పగ్గాలు అందుకోనున్నాడు. 2023లో ఎంఐ న్యూయార్క్ టైటిల్ గెలవడంలో పూరన్(388 రన్స్) కీలక పాత్ర పోషించాడు. ఆ సీజన్‌లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ అతనే. అలాగే, ఐపీఎల్‌-2025లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున రాణించిన పూరన్ 524 పరుగులు చేశాడు. అంతర్జాతీయ స్థాయిలో పూరన్‌కు కెప్టెన్సీ అనుభవం ఉంది. వైట్‌బాల్ ఫార్మాట్స్‌లో విండీస్‌కు నాయకత్వం వహించాడు. ఈ నెల 12న ఎంఎల్‌సీ టోర్నీ ప్రారంభంకానుండగా.. ఈ నెల 13న టెక్సాస్ సూపర్ కింగ్స్‌తో ఎంఐ న్యూయార్క్ తొలి మ్యాచ్ ఆడనుంది.


Next Story