- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Paris olympics : లక్ష్యసేన్‌కు షాక్.. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో ఓటమి
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో షాక్.. పతకం తెస్తాడని భావించిన స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మెడల్ లేకుండానే ఇంటిదారిపట్టనున్నాడు.

X
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో షాక్.. పతకం తెస్తాడని భావించిన స్టార్ షట్లర్ లక్ష్యసేన్ మెడల్ లేకుండానే ఇంటిదారిపట్టనున్నాడు. బ్రాంజ్ మెడల్ మ్యాచ్‌లో లక్ష్యసేన్ పరాజయం పాలయ్యాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో లక్ష్యసేన్ 21-13, 16-21, 11-21 తేడాతో మలేషియాకు చెందిన లీ జి జియా చేతిలో ఓడిపోయాడు. 71 నిమిషాలపాటు సాగిన మ్యాచ్ ఫలితం నిర్ణయాత్మక మూడో గేమ్‌లో తేలింది. మ్యాచ్‌లో మొదట లక్ష్యసేన్‌దే ఆరంభం. తొలి గేమ్‌ను అలవోకగా నెగ్గి పతక ఆశలు రేపాడు. ఆ తర్వాత పట్టు కోల్పోయాడు. వరుసగా రెండు గేమ్‌లను కోల్పోయి పతకాన్ని చేజార్చుకున్నాడు. లక్ష్యసేన్ ఓటమితో ఒలింపిక్స్‌లో భారత షట్లర్ల పోరాటం ముగిసింది. సింగిల్స్‌లో సింధు, ప్రణయ్, డబుల్స్‌లో సాత్విక్-చిరాగ్ జోడీ ఇప్పటికే నిష్ర్కమించిన విషయం తెలిసిందే.
Next Story






