పురుషుల టీ20 ఇంటర్నేషనల్స్‌లో తొలి మహిళా అంపైర్..

by Disha Web Desk 13 |
పురుషుల టీ20 ఇంటర్నేషనల్స్‌లో తొలి మహిళా అంపైర్..
X

దిశ, వెబ్‌డెస్క్: పురుషుల టీ20 ఇంటర్నేషనల్స్‌లో తొలి మహిళా అంపైర్‌గా న్యూజిలాండ్‌‌కు చెందిన కిమ్ కాటన్ నిలిచారు. డ్యునెడిన్‌లో న్యూజిలాండ్- శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఆమె అరంగేట్రం చేశారు. తోటి ఫీల్డ్ అంపైర్ వేన్ నైట్స్‌తో కలిసి గ్రౌండ్‌లో కనిపించారు. పురుషుల క్రికెట్ మ్యాచ్‌లల్లో పూర్తి స్థాయి మహిళా అంపైర్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

కిమ్ కాటన్.. 2018 నుంచి తన కేరీర్‌లో 54 టీ20 ఇంటర్నేషనల్స్, 24 వన్డే ఇంటర్నేషనల్స్‌‌లల్లో టీవీ అంపైర్‌, ఫీల్డ్ అంపైర్‌గా పని చేసినప్పటికీ.. అవన్నీ విమెన్ క్రికెట్ మ్యాచ్‌లే. తొలిసారిగా 2020లో హామిల్టన్‌లో భారత్- న్యూజిలాండ్ మధ్య జరిగిన పురుషుల క్రికెట్ మ్యాచ్‌లో ఆమె మొదటిసారిగా టీవీ అంపైర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్-శ్రీలంక మధ్య జరిగిన రెండో టీ20 ఇంటర్నేషనల్స్‌లో ఫీల్డ్ అంపైర్‌గా ఎంట్రీ ఇచ్చారు.

ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. తొమ్మిది వికెట్ల తేడాతో శ్రీలంకను మట్టి కరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19 ఓవర్లల్లో 141 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ చెలరేగింది. 14.4 ఓవర్లల్లో ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 146 పరుగులు చేసింది.

Next Story

Most Viewed