- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NZ Vs WI : అసాధారణ పోరాటం చేసిన కరేబియన్ బ్యాటర్ గ్రీవ్స్.. కివీస్, విండీస్ తొలి టెస్టు డ్రా
న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో విండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్(202 నాటౌట్) అదరగొట్టాడు.

దిశ, స్పోర్ట్స్ : న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆఖరి రోజైన శనివారం విండీస్ బ్యాటర్ జస్టిన్ గ్రీవ్స్(202 నాటౌట్) అదరగొట్టాడు. ఓటమి తప్ప మరో మార్గం లేదనుకున్న స్థితిలో అతను అసాధారణ పోరాటం చేయడంతో విండీస్ తొలి టెస్టును డ్రా చేసుకోగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో 231 రన్స్ చేసిన కివీస్.. విండీస్‌ను 167 పరుగులకే ఆలౌట్ చేసి 64 రన్స్ ఆధిక్యం సాధించింది. ఇక, రెండో ఇన్నింగ్స్‌ను న్యూజిలాండ్ 466/8 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ కలుపుకుని విండీస్ ముందు 531 పరుగుల భారీ టార్గెట్ పెట్టింది. తొలి మూడు రోజులు తేలిపోయిన విండీస్ ఓటమి ఖాయమే అనుకున్నారంతా.
కానీ, శుక్రవారమే ఛేదనకు దిగిన ఆ జట్టును గ్రీవ్స్‌తో కలిసి షాయ్ హోప్(140) పోటీలోకి తెచ్చాడు. ఇక, చివరి రోజైన శనివారం గ్రీవ్స్ అదిరే ఆట ఆడాడు. షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్(4) అవుటవడంతో భారమంతా గ్రీవ్స్‌పైనే పడింది. తీవ్ర ఒత్తిడిలోనూ అతను పట్టుదలతో బ్యాటింగ్ చేశాడు. డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. 388 బంతులు ఎదుర్కొన్న అతను 202 రన్స్‌తో అజేయంగా నిలిచాడు. కెమార్ రోచ్(58 నాటౌట్) కూడా గొప్ప పోరాటం చేశాడు. గ్రీవ్స్‌తో కలిసి జట్టును ఓటమి నుంచి గట్టెక్కించడానికి తన శక్తికి మించి పోరాడాడు. చివరికి గ్రీవ్స్, రోచ్ పట్టుదల ముందు కివీస్ బౌలర్ల ప్రయత్నాలు ఫలించలేదు. ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 457/6తో నిలిచి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.






