NZ vs UAE : ఓపెనర్లే కొట్టేశారు.. టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ భారీ విజయం

by Harish |

NZ vs UAE : ఓపెనర్లే కొట్టేశారు.. టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ భారీ విజయం
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చెన్నయ్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈ‌పై 10 వికెట్ల తేడాతో భారీ విక్టరీ నమోదు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన యూఏఈ స్వల్ప స్కోరుకేం పరిమితం కాలేదు. కివీస్ బౌలర్లను ఎదుర్కొని ఆ జట్టు 173/6 స్కోరు చేయడం గమనార్హం. ఆ టీమ్‌లో వసీమ్(66), అలిషాన్ షరాఫు(55) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ ఏకంగా 107 పరుగుల భారీ పార్ట్‌నర్‌షిప్ జోడించారు. దీంతో యూఏఈ.. కివీస్ ముందు 174 పరుగుల టఫ్ టార్గెట్ పెట్టింది. కానీ, ఆ లక్ష్యాన్ని న్యూజిలాండ్ చాలా అలవోకగా ఛేదించింది. 15.2 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 175 రన్స్ చేసింది. ఓపెనర్లు సీఫెర్ట్, ఫిన్ అలెన్‌లే జట్టును విజయతీరాలకు చేర్చడం విశేషం. వీరు యూఏఈ బౌలర్లను ఓ ఆటాడుకున్నారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు కొట్టడంతో కివీస్ లక్ష్యాన్ని ఛేదించడానికి పెద్దగా కష్టపడలేదు. సీఫెర్ట్ 42 బంతుల్లో 89 రన్స్ చేయగా.. ఫిన్ అలెన్ 50 బంతుల్లో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. వరుసగా రెండో విజయంతో కివీస్ తర్వాతి రౌండ్ ఆశలను మెరుగుపర్చుకుంది. గ్రూపు దశలో ఆ జట్టు ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. 14న సౌతాఫ్రికాతో, 17న కెనడాతో తలపడనుంది.


Next Story