ఆఖరి ఓవర్‌లో హెన్రీ అద్భుతం.. ఓడిపోయే మ్యాచ్‌లో కివీస్‌ను గెలిపించిన బౌలర్

by Harish |

జింబాబ్వే, సౌతాఫ్రికాలతో జరిగిన టీ20 ట్రై సిరీస్‌‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది.

ఆఖరి ఓవర్‌లో హెన్రీ అద్భుతం..  ఓడిపోయే మ్యాచ్‌లో కివీస్‌ను గెలిపించిన బౌలర్
X

దిశ, స్పోర్ట్స్ : జింబాబ్వే, సౌతాఫ్రికాలతో జరిగిన టీ20 ట్రై సిరీస్‌‌ను న్యూజిలాండ్ కైవసం చేసుకుంది. శనివారం హరారే వేదికగా ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో 3 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై నెగ్గి టైటిల్ ఎగరేసుకపోయింది. బౌలర్ మ్యాట్ హెన్రీ చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేసి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఫైనల్‌లో కివీస్ ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర(47), కాన్వే(47), సీఫెర్ట్(30) రాణించారు. అనంతరం ఛేదనలో సౌతాఫ్రికా గట్టి పోటీనే ఇచ్చింది. ప్రిటోరియస్(51) హాఫ్ సెంచరీతో సత్తాచాటగా.. హెండ్రిక్స్(37), డేవాల్డ్ బ్రెవిస్(31) కూడా పోరాడారు. దీంతో సౌతాఫ్రికా విజయానికి ఆఖరి ఓవర్‌లో 7 రన్స్ అవసరమయ్యాయి. అప్పటికే బ్రేవిస్ దూకుడు మీద ఉండటంతో దక్షిణాఫ్రికా గెలిచేలా కనిపించింది. కానీ, కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ అద్భుతం చేశాడు. ఆఖరి ఓవర్‌లో బ్రెవిస్, లిండె(10)లను అవుట్ చేయడంతోపాటు కేవలం 3 రన్సే ఇవ్వడంతో కివీస్ విజయం లాంఛనమైంది. కివీస్ ఒక్క ఓటమి కూడా చెందకుండా సిరీస్ కైవసం చేసుకోవడం విశేషం.


Next Story