- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఐపీఎల్ ప్లేయర్లకు షాక్..ఇకపై ఈ పనులు అస్సలు చేయొద్దు !
ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానున్న తరుణంలో బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 త్వరలోనే ప్రారంభం కానున్న తరుణంలో బీసీసీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ టోర్నమెంట్ లో పాల్గొనే ప్లేయర్లు, తాము అమలు చేసే రూల్స్ పాటించాల్సిందేనని పేర్కొంది. ఈ రూల్స్ ప్రకారం, క్రికెటర్ల ఫ్యామిలీ మెంబర్లకు డ్రెస్సింగ్ రూమ్స్ లోకి అనుమతి ఉండదు. అదే సమయంలో స్టేడియంలోకి కుటుంబ సభ్యులు రాకూడదు. ఫ్రాంచైజీ ఏర్పాటు చేసిన బస్సుల్లో మాత్రమే హోటల్ నుంచి స్టేడియాలకు చేరుకోవాలి.
ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడేటప్పుడు క్రికెటర్లు స్లీవ్ లెస్ జెర్సీలు ధరించకూడదు. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ అందుకున్న ప్లేయర్లు, కచ్చితంగా ప్రతీ మ్యాచ్ లోనూ వాటిని ధరించాల్సిందేనని బీసీసీఐ ఆదేశించింది. ఇందులో ఏ ఒక్క రూల్ బ్రేక్ చేసినా, మొదటి సారి వార్నింగ్ ఇస్తారని అంటున్నారు. రెండోసారి ఇదే తప్పు జరిగితే, ఫైన్ వేస్తారు. కాగా మార్చి 28న ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఆర్సీబీ, సన్ రైజర్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది.






