- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జనవరి 12న బీసీసీఐ సెక్రెటరీ ఎన్నిక!
by Harish |
వచ్చే ఏడాది జనవరి 12న బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ నిర్వహించనుంది.

X
దిశ, స్పోర్ట్స్ : వచ్చే ఏడాది జనవరి 12న బీసీసీఐ స్పెషల్ జనరల్ మీటింగ్ నిర్వహించనుంది. ఆ సమావేశంలో కొత్త సెక్రెటరీని ఎన్నుకోనున్నట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. అలాగే, నూతన కోశాధికారి పదవికి కూడా ఎన్నిక జరగనుంది. బీసీసీఐ సెక్రెటరీగా ఉన్న జై షా ఈ నెల 1 నుంచి ఐసీసీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో దేవజిత్ సైకియాను బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ తాత్కాలిక సెక్రెటరీగా నియమించారు. శాశ్వత సెక్రెటరీ ఎన్నిక వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారు. మరోవైపు,కోశాధికారి ఆశిష్ షెలార్ ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. జనవరి 12న జరిగే మీటింగ్‌లో సెక్రెటరీ, కోశాధికారి పోస్టులను భర్తీ చేయనున్నారు.
- Tags
- #BCCI
Next Story






