- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
'పేరుకే స్టార్ బ్యాటర్'.. రోహిత్ శర్మపై ఆసీస్ మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మపై ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హెడెన్ తీవ్రమైన విమర్శలు చేశాడు. IPL 2023 సీజన్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై క్వాలిఫయర్-2 లో ఓటమి చెంది.. టోర్నీ నుంచి వైదొలిగింది. గుజరాత్ టైటాన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమై 62 పరుగులతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ కేవలం 8 రన్స్ చేసి నిరాశపరిచాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ బ్యాటింగ్‌పై ఆసీస్ క్రికెటర్ మాథ్యూ హెడెన్ విమర్శలు గుప్పించాడు. టీమ్ ఇండియాకైనా, ఐపీఎల్‌లో అయినా జట్టుకు అవసరమైనప్పడు రోహిత్ శర్మ ఆడటం తాను ఇంతవరకు చూడలేదున్నాడు. పేరుకే స్టార్ బ్యాటర్ అని విమర్శించాడు. 'రోహిత్ శర్మ స్టార్ బ్యాటరే. కానీ జట్టుకు అవసరమైనప్పుడు అతను బాగా ఆడటం ఎప్పుడూ చూడలేదు. టీమ్ ఇండియాకు కానీ ముంబై ఇండియన్స్ జట్టుకు కానీ అతని అవసరం ఉన్నప్పుడు దారుణంగా విఫలమయ్యాడు.'అని హెడెన్ చెప్పుకొచ్చాడు.