- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మ్యాక్స్‌వెల్‌ను పెళ్లి చేసుకుంటే బాగా ఆడేవాడేమో..ప్రీతి జింతాకు పిచ్చి ప్రశ్న
బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింతాకు సోషల్ మీడియాలో పిచ్చి ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియాలో ప్రీతి జింతా ఆస్క్ మీ ఎనీథింగ్ అని పోస్ట్ పెట్టగా ఓ నెటిజెన్ మీరు మ్యాక్స్ వెల్‌ను పెళ్లి చేసుకుని ఉంటే ఐపీఎల్ లో భాగా ఆడేవాడేమో అని పిచ్చి ప్రశ్న వేశాడు.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింతాకు సోషల్ మీడియాలో పిచ్చి ప్రశ్న ఎదురైంది. సోషల్ మీడియాలో ప్రీతి జింతా ఆస్క్ మీ ఎనీథింగ్ అని పోస్ట్ పెట్టగా ఓ నెటిజెన్ మీరు మ్యాక్స్ వెల్‌ను పెళ్లి చేసుకుని ఉంటే ఐపీఎల్ లో భాగా ఆడేవాడేమో అని పిచ్చి ప్రశ్న వేశాడు. దానికి బ్యూటీ ఘాటుగా స్పందించింది. ఈ ప్రశ్న మీరు జట్టు యజమాని పురుషుడు ఉన్నవారిని అడుగుతారా? లేదంటే కేవలం ఈ రకమైన వివక్ష మహిళలపై మాత్రమేనా.? అని ప్రశ్నించింది.
తాను క్రికెట్ ప్రపంచంలోకి అడుగుపెట్టే వరకు కార్పొరేట్ సెటప్‌లలో మాత్రమే మహిళలు మనుగడ సాగించడం ఎంత కష్టమో తనకు అర్థం కాలేదని పేర్కొంది. మీరు కామెడీ కోసమే దీనిని అడిగారని అనుకుంటాను, కానీ మీరు మీ ప్రశ్నను చదివి ఏం సూచిస్తున్నారో ఆలోచించుకోండి. ఎందుకంటే మీ ఆలోచన విధానం అలాగే ఉంటే అది సరికాదు. అంటూ ఇచ్చిపడేసింది. ప్రస్తుతం ప్రీతి జింతా నెటిజన్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో నెటిజన్లు ప్రీతి జింతాకు మద్దతు పలుకుతూ కామెంట్లు చేసినవాడిపై ఫైర్ అవుతున్నారు.






